PV Sindhu: "విజయ్ దేవరకొండ సినిమాలు నాకు నచ్చవు.. నా ఫేవరెట్ హీరోలు వాళ్లే"

ప్రముఖ బ్యాడ్మింటన్ ఛాపింయన్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆటతో అనేక పథకాలు సాధించిన ఈమె.. 2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలోనే తనకు విజయ్ దేవరకొండ సినిమాలు అంటే నచ్చవని చెప్పింది. అలాగే తన ఫేవరెట్ హీరోలు, సినిమాల గురించి వివరించింది. ఆ వివరాలు చూద్దాం.

పీవీ సింధుకు... టాలీవుడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అంటే నచ్చదు అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ముఖ్యంగా ఆయన సినిమాలు చూడాలనిపించవని వివరించింది. ఎందుకు చూడాలనిపిందు, విజయ్ దేవరకొండ ఏ సినిమాలు మీకు నచ్చవని యాంకర్ అడగ్గా.. వద్దులెండి మళ్లీ వైరల్ అయిపోతానంటూ ఫన్నీగా రెస్పాండ్ అయింది. నిజంగానే తనకు విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చవు అని స్పష్టం చేసింది.

 Badminton Champion PV Sindhu Said She Did Not Like Vijay Devarakonda Movies Check Details

అలాగే తనకు ఇష్టమైన హీరోల పేర్లు చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టం అని.. ఆయన చేసే సినిమాలు అన్నీ చూస్తుంటానని వెల్లడించింది. అతడి యాక్టింగ్ అంటే తనకు మరింత ఇష్టం అని వెల్లడించింది. ఆయన మీ క్రష్ అంట కదా అని యాంకర్ అడగ్గా.. అదేం లేదు.. సినిమాలు, ఆయన అంటే ఇష్టం మాత్రమే అని సున్నితంగా చెప్పుకొచ్చింది. ఆయనను ఎప్పుడైనా కలిశారా, ఫోన్ లో అయినా ఎప్పుడైనా మాట్లాడారా అని యాంకర్ అడగ్గా... లేదని సమాధానం చెప్పింది. ఫోన్ లో కూడా మాట్లాడలేదని వివరించింది.

టాలీవుడ్ లో ఇంకా ఎవరు ఇష్టం అని అడగ్గా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్పింది. ఆయన కూడా చాలా బాగా నచ్చుతాడని.. ఆయన యాక్టింగ్ కూడా బాగుంటుందని పీవీ సింధు చెప్పుకొచ్చింది. RRR సినిమాలో ఆయన నటన అయితే అద్భుతం అని పేర్కొంది. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా ఇష్టం అని.. RRR సినిమాలో వీరిద్దరి యాక్టింగ్ నచ్చుతుందని చెప్పుకొచ్చింది. ఇక చివరగా మెగాస్టార్ చిరంజీవి గురించి వెల్లడిచింది.

 Badminton Champion PV Sindhu Said She Did Not Like Vijay Devarakonda Movies Check Details

తాను ఒలంపిక్స్ లో గెలిచాకా.. స్పెషల్ గా పిలిచి తనకు పార్టీ ఇవ్వడం, అందరినీ ఒక్క చోట చేర్చి సెలబ్రేట్ చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పీవీ సింధు చెప్పుకొచ్చింది. ఆయన తనకు చాలా బాగా సపోర్ట్ చేస్తారని.. అందువల్లే ఆయన అంటే తనకు చాలా గౌరవం అని పీవీ సింధు వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X