‘భారతీయుడు 2’లో సౌత్ కొరియా నటి?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్‌కు అంతా సిద్ధమైంది. 'భారతీయుడు 2' పేరుతో రాబోతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 18 నుంచి మొదలు కాబోతోంది.
కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌత్ కొరియా నటి బే సూజీ ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

షూటింగుకు సంబంధించిన విషయానికొస్తే... రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు చెన్నై, పొల్లాచ్చి, ఉక్రెయిన్లో ప్లాన్ చేశారు. తైవాన్‌లో మేజర్ షెడ్యూల్ జరుగుతుందని టాక్. తైవాన్ షెడ్యూల్‌లో బే సూజీ నటించనుందట.
ఇంతకు ముందు శంకర్‌తో 2.0 చిత్రం నిర్మించి లైకా ప్రొడక్షన్స్ వారు 'భారతీయుడు 2' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











