"ఆ సినిమా కోసం వారం రోజులు కష్టపడ్డా.. కానీ నన్ను తీసేసి మహేష్ బాబు కొడుకును పెట్టుకున్నారు"

అనేక సినిమాలు చేతిలోకి వచ్చినట్లు వచ్చి పోయేవి చాలా ఉంటాయి. అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, హీరోలు సైతం ఈ సమస్యలను ఎదుర్కుంటారు. సినిమా షూటింగ్ అయి రెమ్యునరేషన్ కూడా తీసుకున్న తర్వాత.. సినిమాలో కనిపించకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి ఘటనే తనకు కూడా ఎదురైందని.. ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ గా కనిపించిన ఓ కుర్రాడి ఓ అదిరిపోయే సినిమా అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు. ఆ చిత్రంలో తనను తీసుకోకుండా మహేష్ బాబు కొడుకును పెట్టుకున్నట్లు వివరించాడు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బాహుబలి సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ లో కనిపించి ఇరగ దీసిన కుర్రాడు నిఖిల్ దేవాదుల గురించి అందిరకీ తెలిసిందే. హీరోయిన్ రమ్య కృష్ణకు తేలు కుట్టుకుండా అడ్డుకుని, కట్టప్ప చేతితో అన్నం తిన్న ఈయన తన నటనతో అందిరనీ మెప్పించాడు. కేవలం ఈ ఒక్క సినిమాలోనే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించాడు. బాబు బాగా బిజీ, సీతా రామం వంటి చిత్రాలు కూడా చేసి అందరికీ దగ్గరయ్యాడు.

Bahubali Child Artist Nikhil Devadula Shocking COmments on One Nenokkadina Movie Check Details

అయితే ఈయన జీవితంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ముఖ్యంగా తాను చుదువుకుంటూనే సినిమాలు చేశానని.. పదో తరగతిలో ఉండగా బాహుబలి సినిమా చేసినట్లు వివరించాడు. కేవలం వారం రోజులు మాత్రమే తాను ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు వివరించాడు. అయితే మహేష్ బాబు హీరోగా చేసిన వన్ నేనొక్కడినే సినిమా కోసం కూడా తాను పని చేసినట్లు చెప్పాడు.

ముఖ్యంగా ఆ సినిమాకు వారం రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహించారని.. అందులో కొందరిని షార్ట్ లిస్ట్ చేశారని నిఖిల్ దేవాదుల వివరించాడు. అయితే ఈ సినినిమాలో తాను సెలెక్ట్ అయ్యానని.. బట్టల కోసం కొలతలు కూడా తీసుకున్నారని తెలిపాడు. అయితే వారం రోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తామని చెప్పి పంపించారట. ఇంటికి వెళ్లాకా చాలా రోజుల పాటు ఫోన్ రాలేదట. ఆ తర్వాత కొంత కాలానికే ఆ సినిమాలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారట.

Bahubali Child Artist Nikhil Devadula Shocking COmments on One Nenokkadina Movie Check Details

తానుండాల్సిన పాత్రలో మహేష్ బాబు కొడుకు ఉండడం చూసి షాక్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఆ విషయం తెలిసి కాస్త బాధ అనిపించిందని.. కానీ ఆ తర్వాత అంతగా పట్టించుకోలేదని వివరించాడు. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన తాను పలు సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించాడు. మరో నాలుగు నెలల తర్వాత తన చిత్రాలు విడుదల అయ్యే అవకాశం ఉందని వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X