రాజమౌళిని ఆత్మీయంగా పలకరించిన జపాన్ అభిమానులు.. బాహుబలి క్రేజ్ అంటే అదే మరి
బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. దర్శకధీరుడు ఆలోచనలకు ప్రతిరూపమే బాహుబలి. అమరశిల్పి జక్కన్న శిల్పాలను చెక్కినట్లుగా.. మన జక్కన్న ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా మలుచుతాడు. రాజమౌళి అద్భుత సృష్టికి నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఆల్బర్ట్ రాయల్ హాల్‌లో..
తాజాగా ఈ మూవీకి సంబంధించిన లైవ్ కాన్సర్ట్.. లండన్‌లోని ఆల్బర్ట్ రాయల్ హాల్‌లో జరుగుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి అందరూ హాజరయ్యారు. బాహుబలి ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన మ్యూజిక్‌ను లైవ్‌గా ప్రదర్శించడంతో హాల్ అంతా కిక్కిరిసిపోయింది.
జపాన్ అభిమానుల ఆత్మీయ పలకరింపు..
ఈ వేడుకులకు హాజరైన వేళ.. రాజమౌళిని కొందరు జపాన్ అభిమానులు చుట్టుముట్టారు. జక్కన్నను చూడటంతో ఆనందంతో గంతులేశారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా వీరందరినీ కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ జక్కన్న కూడా కాస్త ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది.
రానా పోస్ట్ చేసిన పిక్ వైరల్..
లైవ్ కాన్సర్ట్ జరుగుతున్న హాల్ ఫోటోను పోస్ట్ చేశాడు. హాల్ అంతా నిండిపోయి ఉన్న ఈ పిక్‌ను పోస్ట్ చేస్తూ.. గొప్పది, శక్తివంతమైన మాహిష్మతి రాజ్యం అంటూ గుర్తు చేసుకున్నాడు. ఈ వేడుకలో మళ్లీ అందరూ కలవడంతో రాయల్ రీయూనియన్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో హల్ చల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











