twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి వెబ్ సిరీస్.. ఆలస్యం కావడానికి అసలు కారణమిదే!

    |

    దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న చిత్రం బాహుబలి. ఆ సినిమా కథతో పాటు పాత్రలు కూడా ఆడియెన్స్ లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ని క్రియేట్ చేశాయి. అయితే ఆ సినిమా కథను వెబ్ సిరీస్ లాగా కొనసాగిస్తే బావుంటుందని దర్శకుడు రాజమౌళి ముందే చెప్పేశాడు.

    ఆ ఆలోచన మేరకు ఓటీటీ రారాజు నెట్ ఫ్లిక్స్, ఆర్కా మీడియాతో కలిసింది. వీరి సంయుక్త ప్రొడక్షన్ లో బహుబలి వెబ్ సిరీస్ ని కొనసాగించాలని అనుకున్నారు. 13 ఎపిసోడ్స్ కి కథను కొనసాగించగా, ప్రవీణ్ సత్తారు, దేవకట్టా దర్శకులుగా సెలెక్ట్ అయ్యారు. మొదటి ఎపిసోడ్ ని రాజమౌళి డైరెక్ట్ చేయగా మిగతా షూటింగ్ ని ఆ ఇద్దరు పూర్తి చేశారట. అయితే కొంత షూటింగ్ తరువాత అందులో VFX వర్క్ పై నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏ మాత్రం సంతృప్తి చెందలేదట.

    Bahubali web series latest update and reshoot work

    పైగా కొన్ని సీన్స్ కూడా నచ్చకపోవడంతో రీ షూట్ చేసేందుకు సిద్ధమయ్యారట. బాహుబలి లాంటి కథను నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తోంది అంటే అంచనాలకి తీసిపోని విదంగా ఉండాలని అనుకుంటున్నారట. అందుకే మరోసారి రీ వర్క్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. మరి ఆ బిగ్ బడ్జెట్ వెబ్ సిరీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారో చూడాలి.

    English summary
    Baahubali is a film that has been a sensational success all over the country and has been recognized at international film festivals. Along with the story of the film, the characters also created a special attraction in the audience. Director Rajamouli has predicted, however, that it would be better if the story would continue as a web series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X