రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ముందు అమీర్ ఖాన్ కోసం రాస్తున్నా విజయేంద్ర ప్రసాద్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరొక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఈ దర్శకుడు ఎన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు తీసినా కూడా తన డ్రీమ్ ప్రాజెక్టు మాత్రం మహాభారతం అనే చెబుతాడు.
తప్పకుండా ఆ సినిమా చేస్తాడని ఆడియెన్స్ లో ఒక నమ్మకం అయితే ఉంది.ఇక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా కథను రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మహాభారతం కథతో వెబ్ సిరీస్ ని ప్లాన్ చేయాలని అమీర్ ఖాన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. గత కొంత కాలంగా బ్యాక్ గ్రౌండ్ లో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అమీర్ ఖాన్ మహాభారతం వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పాడు.

అందుకోసం అమీర్ ఖాన్ బహుబలి రైటర్ విజయేంద్ సహాయం కూడా తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. అందుకు ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాక్. అయితే మరోవైపు విజయేంద్ర ప్రసాద్ లేకపోతే రాజమౌళి తన కలల ప్రాజెక్టును పూర్తి చేయడం అంత ఈజీ కాదు. ఆయననే కథను సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక అందరికి తెలిసిన కథను రెండు వెర్షన్స్ లలో విజయేంద్ర ప్రసాద్ రాయగలరా అనేది కూడా మరొక సస్పెన్స్. మరి ఈ ప్రాజెక్టును ముందు ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











