సూపర్ క్రేజీగా బైలంపుడి ఫస్ట్‌లుక్.. ట్రిమండస్ రెస్పాన్స్
తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానంద రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'బైలంపుడి'. హరీష్ వినయ్, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అనిల్ పి.జి. రాజ్ దర్శకుడుగా పరిచయమౌతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. నిర్మాత ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ...''పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా 'బైలంపుడి' చిత్రాన్ని నిర్మిస్తున్నా. అందరూ కొత్తవారైనప్పటికీ ఎంతో సహజసిద్ధంగా నటించారు. హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాని తెరకెక్కించాము. ఇక్కడ యుద్ధం చేయాలి...గెలవడానికి కాదు, బతకాడానికి అనేది మా సినిమా క్యాప్షన్. ప్రస్తుతం సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమౌతున్నది. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం" అని అన్నారు.

దర్శకుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ...
బైలంపుడి అనే గ్రామంలో జరిగే లవ్ అండ్ పొలిటికల్ చిత్రమిది. ప్రతి పాత్ర ఎంతో సహజ సిద్ధంగా ఉంటుంది. ఒక విలేజ్ లో ఏమైతే అంశాలు ఉంటాయో...మా సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం కొత్త కథలను ఆదరిస్తున్నారు. బైలంపూడి అదే తరహాలో ఉంటుందని తెలియజేస్తున్నాం అని అన్నారు.

నటీనటులు: హరీష్ వినయ్, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్, నటరాజ్, నరి, నాగార్జున, సెబాస్టియన్ తదితరులు
సంగీతం: సుభాష్ ఆనంద్,
డైలాగ్స్: సాయి,
ఎడిటర్: జానకిరామ్,
ఫైట్స్: కృష్ణంరాజ్,
ఆర్ట్: ఉత్తమ్‌కుమార్,
డాన్స్: ఘోరా,
లిరిక్స్: రామారావు,
పిఆర్వో: శ్రీ
నిర్మాత: బ్రహ్మానంద రెడ్డి


Click it and Unblock the Notifications











