మరో వివాదంలో సాయి పల్లవి.. రంగంలోకి భజరంగ్ దళ్.. సినిమాను అడ్డుకుంటాం అంటూ..
లేడీ పవర్ స్టార్ గా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును అందుకున్న సాయి పల్లవి ఇటీవల విరాటపర్వం సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాయి పల్లవి కామెంట్స్ చేసినట్లుగా ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల విమర్శలు ఎదురయ్యాయి. ఇక రేపు విరాట పర్వం సినిమా విడుదల అవుతుండగా భజరంగ్ దళ్ రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. చట్టపరంగా పోరాడేందుకు కొందరు ఆమెపై పోలీసు కేసు కూడా నమోదు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విరాటపర్వం గ్రాండ్ రిలీజ్
రానా దగ్గుబాటి సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన విరాటపర్వం సినిమా శుక్రవారం భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో ఒక అందమైన ప్రేమకథ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ అయితే బాగానే చేశారు.

సాయి పల్లవి కామెంట్స్ వైరల్
సాయి పల్లవికి జనాల్లో అయితే పాజిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి. గతంలో ఆమెపై ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చింది లేదు. కానీ మొదటిసారే సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాశ్మీరి ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. కొంతమంది మరో మతం యువకుడిపై కూడా జైశ్రీరామ్ అని దాడి చేశారని ఇరువర్గాలకు మధ్య తేడా ఏముంటుంది అని సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఓ వర్గం వారిలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించాయి.

ఏ మాత్రం కరెక్ట్ కాదని..
ఇప్పటికే విరాటపర్వం సినిమాను బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కూడా చాలా రకాల నెగటివ్ కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. కొన్ని ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇక సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆమె వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని క్షమాపణలు కూడా చెప్పలేని సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్స్ ఇచ్చారు.

రంగంలోకి భజరంగ్ దళ్
అయితే సాయి పల్లవి పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా కొన్ని హిందూ సంఘాలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి భజరంగ్ దళ్ కూడా రంగంలోకి దిగి సాయి పల్లవి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బజరంగ్ దళ్ వార్తల్లోకి రావడంతో ఒక్కసారిగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

టైటిల్ కూడా మార్చాలి అంటూ..
పాండవుల అజ్ఞాత ఘట్టమైన విరాట వరవాన్ని టైటిల్ తప్పుగా వాడినట్లు చెబుతూ వెంటనే టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డ్ కి భజరంగ్ దళ్ సభ్యులు లేఖ రాశారు. భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు హిందూ ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలు ఉంటే కూడా వెంటనే తొలగించాలని అలాగే సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు కూడా వారు సీరియస్ అయ్యారు. సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని కూడా వారు సెన్సార్ బోర్డ్ కు ఓ లేఖ రాసారు.

మరింత ముదురుతున్న వివాదం
సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల కారణంగా విరాటపర్వం సినిమాపై ఇప్పటికే ఓ వర్గం వారు బ్యాన్ చేయాలి అంటూ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయగా ఇప్పుడు భజరంగ్ దళ్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావడంతో ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతవరకు సాయి పల్లవి విమర్శలపై పెద్దగా స్పందించింది లేదు. ఇక సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ఆమె ఈ వివాదానికి ముగింపు కార్డు పెడితేనే బాగుంటుంది అని ఓ వర్గం వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











