బాలకృష్ణ మూవీలో భజరంగీ భాయ్‌జాన్ చిన్నారి.. కళ్లు జిగేల్ అనిపించేలా అందాలతో!
ఇండియన్ సినిమా రంగంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్‌జాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సెన్సేషనల్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం కలెక్షన్ల పంట పండించడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేసింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తోపాటు సరి సమానంగా చిన్నారి హర్షాలీ మల్హోత్రా పాపులారిటీ సాధించింది. కేవలం ఉత్తరాది ప్రేక్షకులను కాకుండా దక్షిణాది ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నది. ఇక ప్రస్తుతం తెలుగు వారి హృదయాల్లో చోటు సంపాదించడానికి ఈ అందాల భామ సిద్దమవుతున్నది. బాలనటిగా పరిచయమైన ఈ అందాల సుందరి ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
హర్షాలీ మల్హోత్రా విషయానికి వస్తే.. మహారాష్ట్రకు చెందిన పంజాబీ హిందూ ఫ్యామిలీలో హర్షాలీ జూన్ 3వ తేదీ 2008 సంవత్సరంలో జన్మించింది. సినిమాలపై ఆసక్తి ఉండటంతో పలు ఆడిషన్స్‌కు చిన్నారిని పంపారు. భజరంగీ భాయ్‌జాన్ సినిమాలో నటించినప్పుడు ఈ చిన్నారికి ఏడేళ్లు. చిన్న వయసులోనే బాలనటిగా మున్నీ పాత్రలో అద్బుతంగా నటించింది. మూగ అమ్మాయి మున్నీగా తన హావభావాలతో గుండెలు పిండేసే నటనను ప్రదర్శించింది. దాంతో ఆ చిన్నారికి అప్పట్లో లక్షలాది మంది అభిమానులు ఏర్పడ్డారు. తన నటించిన తీరుకు అవార్డులు, రివార్డులు లభించాయి. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం హిందీలో నాస్తిక్, తెలుగులో అఖండ సినిమాల్లో నటిస్తున్నది.

భజరంగీ భాయ్‌జాన్ సినిమా తర్వాత కొన్నాళ్లు చదువులకే తన సమయాన్ని కేటాయించింది. 2012 నుంచి మళ్లీ వినోద పరిశ్రమలో అడుగుపెట్టింది. బుల్లితెర మీద ఖుబుల్ హై, లౌట్ ఆవో త్రిషా, సువిధాన్ ఇండియా, సబ్‌సే బడా కళాకార్ సీరియల్స్‌లో నటించింది. 17 ఏళ్లకుపై బడిన ఈ అందాల భామ ప్రస్తుతం పూర్తి స్థాయిలో నటనపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది.
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 చిత్రం ద్వారా నేరుగా హర్షాలీ మల్హోత్రా తెలుగులోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రంలో జనని అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఫోటోను మీడియాకు విడుదల చేసింది. భజరంగీ బ్యూటీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఇదిలా ఉండగా, అఖండ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 చిత్రం రూపొందుతున్నది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం తేజస్వినీ ఎన్ సమర్పణలో ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి ఆచంట తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సీ రాంప్రసాద్, సంతోష్ సినిమాటోగ్రఫి, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాలో జనని పాత్రలో ఏ మేరకు హర్షాలీ తన మార్క్‌ను తెలుగు ప్రేక్షకులకు చూపిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











