లవర్ కోసం ఒక్క రోజే అంత ఖర్చు.. సడెన్‌గా ఇంట్లో వాళ్లు అలా: బలగం దర్శకుడు వేణు

జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 3న విడుదలైన బలగం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా పలు అవార్డ్స్ సైతం సాధిచింది. అయితే తాజాగా కమెడియన్, డైరెక్టర్ వేణి తన లవర్ కోసం చేసిన ఖర్చు వంటి పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

Balagam Director Venu Yeldandi About His Lover And Personal Life

అనుభవాలు: బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన బలగం సినిమాకు ప్రేక్షకులు ఎలా నీరాజనాలు పట్టారో తెలిసిందే. ఈ సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు సైతం వచ్చాయి. ఇక తాజాగా జీవితంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా వెల్లడించాడు వేణు.

Balagam Director Venu Yeldandi About His Lover And Personal Life

ఆర్టిస్ట్ అయ్యాక: "యూత్ లో ఉన్నప్పుడు అందరిలాగే నాక్కూడా నా ఆటోగ్రాఫ్ లాంటి లవ్ స్టోరీ ఒకటి ఉంది. అయినా ఆ వయసులో అన్నీ అన్ మెచ్యూర్డ్, వన్ సైడ్ లవ్ స్టోరీలే. ఆ తర్వాత నాకు జరిగిన అవమానం కారణంగా అసలు లవ్ చేయాలంటేనే భయమేసేది. నాకసలు లవ్ అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఆర్టిస్ట్ అయ్యాక బాగుందని ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను" అని వేణు యెల్దండి తెలిపాడు.

Balagam Director Venu Yeldandi About His Lover And Personal Life

గోల్కొండ కోటకు: "పంచ్ లు వేస్తే నవ్వేది. వాళ్ల ఇంటికి వెళ్లినా ఏమనకపోయేవారు. సో.. ఇక ఏ సమస్య ఉండదు, అంతా సెట్ అనుకన్నా. అమ్మాయి క్యూట్ గా ఉంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. అంతా పాజిటివ్ గా ఊహించుకున్నా. ఓ రోజు ఫేక్ బర్త్ డే క్రియేట్ చేసుకుని ఆమెతోపాటు ఫ్రెండ్స్ అందర్నీ గోల్కొండ కోటకు తీసుకెళ్లి.. అంతా తిరిగాం. మధ్యలో అమ్మాయితో మాట్లాడటం, జోకులేయడం అంతా చేశాను" అని వేణు పేర్కొన్నాడు.

లెక్కలు వేస్తే: "సాయంత్రం ఇంకా ఎక్కువ సేపు గడపాలనిపించింది. ఆమెకు గుర్తుండిపోయే రోజుగా చేయాలని నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లి ఓ పెద్ద హోటల్ డిన్నరిచ్చాను. ఆ తర్వాత ఇంటికొచ్చి లెక్కలు వేసుకుంటే మొత్తం రూ. 25 నుంచి 30 వేలు అయింది. ఇక్కడ ఖర్చు కాదు. కానీ దీనికి వారం రోజు నుంచే ఏర్పాట్లు. ఫ్రెండ్స్ ను గ్యాదర్ చేసుకోవడం, వాళ్లు వచ్చేలా చేయడం వంటివి ఇలా అన్నీ చేశాను" అని వేణు చెప్పుకొచ్చాడు.

Balagam Director Venu Yeldandi About His Lover And Personal Life

గంట కోసం: "కళ్లు మూసుకుని ఆలోచిస్తుండగానే నా మనసుకు సడెన్ గా మా ఇంట్లోవాళ్లు గుర్తొచ్చారు. నాకు ఎక్కువగా అక్కలతో ఎమోషనల్ ఎక్కువ. నేను ఇండస్ట్రీకి వస్తుంటే వాళ్లు ఎన్ని పూజలు చేశారో నాకు తెలుసు. నా 25 ఏళ్ల జీవితంలో వీళ్లందరూ ఇంత చేస్తే.. నేను ఒక గంట కోసం ఇంత చేశాను. ఆ అమ్మాయిని పడేయటానికి ఇంత ప్లాన్ వేసి, ఇన్ని చేశాను. నా జీవితం ఆలోచించిన వాళ్ల కోసం ఆలోచించలేకపోయానే అనిపించింది" అని వేణు వెల్లడించాడు.

Balagam Director Venu Yeldandi About His Lover And Personal Life

ఓవర్ ప్రేమతో: "ఎవర్నో కాదు మా వాళ్లను ఇంప్రెస్ చేయాలని అప్పుడు అనుకున్నా. అప్పటి నుంచి ఆ అమ్మాయిని పక్కన పెట్టాలని డిసైడ్ అయి మా అక్కలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నా. వాళ్ల మీదున్న ఓవర్ ప్రేమ వల్ల నాకిష్టమైన అమ్మాయిని చేసుకుంటే వాళ్లకు నచ్చకపోతే కష్టం కదా. అందుకే వాళ్లు చూసన మా చుట్టాల్లో ఒక అమ్మాయిని చూపిస్తే ఆమెనే చేసుకున్నా" అని వేణు యెల్దండి వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X