Balagam మూవీకి మరో అంతర్జాతీయ అవార్డు.. ఇప్పటి వరకూ ఎన్ని గెలిచిందో తెలిస్తే షాకే!
చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగులో సహజ సిద్ధమైన కథలతో చాలా తక్కువగానే సినిమాలు వస్తున్నాయి. అందుకే మన చిత్రాల్లో నేచురాలిటీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలి కాలంలో దర్శకులు కొత్త ప్రయోగాలు చేస్తూ.. స్వచ్చమైన కథలతో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఇటీవల అలా వచ్చిన సినిమానే 'బలగం'. తెలంగాణ ప్రాంతంలోని సంప్రదాయాలకు అద్దం పట్టే సహజ సిద్ధమైన కథతో రూపొందిన ఈ మూవీని ఫేమస్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని ఏరియాల్లోనూ ఊహించని రీతిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.72 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.30 కోట్లు షేర్ కలెక్ట్ అయింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 11 కోట్ల రూపాయల వరకూ లాభాలను కూడా సొంతం చేసుకుంది.

మంచి సందేశాత్మకమైన కథతో రూపొందిన 'బలగం' మూవీ ఓటీటీలోనూ రికార్డు వ్యూస్‌తో సత్తా చాటుతోంది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్శించింది. ఫలితంగా ఈ చిత్రానికి అప్పుడే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమ్‌స్టర్‌డ్యామ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను ప్రకటించారు. ఇందులో వేణు ఎల్ధండి 2023 సంవత్సరానికి గానూ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని వేణు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు, తనను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు, దీనితో 'బలగం' మూవీకి తొమ్మిది అవార్డులు వచ్చినట్లు కూడా తెలిపాడు.
'బలగం' మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలను చేశారు. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ సహా ఎంతో మంది అద్భుతమైన నటనతో అలరించారు.


Click it and Unblock the Notifications











