రెండోసారి తండ్రి అయిన టాప్ కమెడియన్.. ఇండస్ట్రీతోపాటు బిడ్డ పుట్టిన వేళ!
వేణు యెల్దండి... ఈ పేరు ఎక్కువ మందికి తెలియక పోయినా, బలగం వేణు అంటే మాత్రం చాలా మందికి వెంటనే క్లిక్ అవుతుంది. అలా కాకపోయినా జబర్దస్త్ కమెడియన్ వేణు అంటే కూడా వెంటనే గుర్తు పట్టేస్తారు. కమెడియన్ అద్భుతమైన టాస్కులు చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఆయన డైరెక్టర్ గా మారి ఓ సినిమాను తెరకెక్కించారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు కంటతడి పెట్టేలా చేశారు.
కావ్య కల్యాణ్ రామ్, ప్రియదర్శి హీరోహీరోయిన్లుగా వచ్చి ఆ చిత్రం ఎంత పెద్ద హిట్టు అయ్యిందో అందరికీ తెలిసిందే. అంతటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన రెండోసారి తండ్రి అయ్యాడు. తాజగా వేణు భార్య ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేరుగా ఆయనే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పాపను ఎత్తుకొని దిగిన ఫొటోను షేర్ చేశాడు. నాకు ఆడపిల్ల పుట్టింది, నా కుటుంబం పెరగడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

వేణుకు ఇప్పటికే రేవంత్ అనే ఓ బాబు ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టడంతో.. వారి ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఓ బాబు, పాప ఉండడంతో తెగ సంబరపడిపోతున్నాడు వేణు. ఆయన చేసిన ఈ పోస్ట్ చూసిన అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. డైరెక్టర్ గా హిట్టు కొట్టిన నీవు.. తండ్రిగా కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటున్నామంటూ వివరిస్తున్నారు.

బలగం సినిమా తర్వాత వేణు మరో సినిమాకు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కథ కూడా రాసుకొని ఓ స్టార్ హీరోకు కథ వినిపించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఫేక్ న్యూస్ యే అని తెలుస్తోంది. తనకు బలగంతో హిట్టు ఇచ్చిన ప్రియదర్శితోనే మరో సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి కూతురు పుట్టన సంతోషంలో త్వరలోనే తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేస్తాడేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











