బలగం సినిమాకు అరుదైన గౌరవం.. లాస్ ఎంజెలెస్‌లో రెండు అవార్డులతో సత్తా చాటిన వేణు
కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం బలగం. పక్కా తెలంగాణ నేటివిటితో చావు అనే ఎమోషన్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిన ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని కదిలిస్తున్నది. ఈ సినిమాకు సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా క్రిటిక్స్, సినీ ప్రముఖుల నుంచి భారీ ప్రశంసలు వచ్చాయి. కేవలం ఈ సినిమా ప్రశంసలకే పరిమితం కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేట్రికల్‌గా మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఇలా అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బలగం సినిమాకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని లాస్ ఏజెంలెస్ సినిమాటోగ్రఫి అవార్డు (LACA)లో బలగం సినిమా సినిమాటోగ్రపి విభాగం సత్తా చాటుకొన్నది. ఈ అవార్డుల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆచార్య వేణును అవార్డు వరించింది. ఇంకా ఉత్తమ చిత్రంగా కూడా బలగం అవార్డును అందుకొన్నది. ఈ అవార్డును దర్శకుడు వేణుకు అందజేశారు.

ఇటీవలే తెలుగు సినిమా RRR కూడా అంతర్జాతీయంగా అవార్డులతో సత్తా చాటింది. ఈ చిత్రానికి గొల్డెన్ గ్లోబ్, ఆస్కార్ తదితర అవార్డులను సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలోనే తెలుగు ప్రజల ప్రశంసలు అందుకొంటున్న బలగం కూడా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం మరోసారి గర్వంగా మారింది.

దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు టిల్లు డైరెక్షన్‌లో వచ్చిన బలగం సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ తదితరులు నటించారు. దాదాపు 15 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











