కాక రేపుతున్న కావ్య పాప.. బలగం బ్యూటీ బోల్డ్ లుక్స్ వైరల్..

Kavya Kalyan Ram: కావ్య కళ్యాణ్ రామ్.. గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. గంగోత్రి సినిమాలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో 'వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లంగ రమ్మంటా..' అనే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇటీవల బలగం సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో సంధ్యగా అదరగొట్టేసింది. బలగం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే.. ఈ పిల్లి కళ్ల పిల్లాకు అంతే గుర్తింపు వచ్చింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలిన ఫొటోలు 'హాట్' టాపిక్ అవుతున్నాయి.

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కావ్య.. స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, బాలు, విజయేంద్ర వర్మ, సుభాష్ చంద్రబోస్, పాండు రంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా తదితర సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.తర్వాత కావ్య పాప చదువుపై దృష్టి పెట్టింది. కానీ, అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పించింది.

Balagam Movie Heroine Kavya Kalyan Ram Stunning Hot Looks and Latest Photo Shoot viral

జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన 'బలగం' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కావ్య కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో సంధ్యగా అదరగొట్టేసింది. ఓ పల్లెటూరి అమ్మాయిలా అదరగొట్టింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ చిన్నదాని కేరిర్ ట్రాక్ లో పడిందని భావించారు. కానీ, అనుకున్నంత విజయం రాలేదని చెప్పాలి. వరుస సినిమా ఆఫర్లు వచ్చిన వాటిలో సరైన గుర్తింపు రాలేదు.

బలగం తరువాత శ్రీ సింహా హీరోగా నటించిన 'ఉస్తాద్' అనే సినిమాలో నటించింది. కానీ, ఈ సినిమా ఫ్లాప్ కావడంతో కావ్య కు ఆఫర్లు కూడా రావడం లేదు. దీంతో ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటుంది. కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. సినిమాలలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించే కావ్య సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ డోసును పెంచేస్తూ.. తన అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా కావ్య తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది.

More from Filmibeat

Read more about: balagam movie kavya kalyan ram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X