13th Dadasaheb Phalke Award బలగం సీతా రామం చిత్రాలకు అరుదైన అవార్డ్.. ఏ క్యాటగిరీలో అంటే?

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మంకగా భావించే పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ కార్యక్రమం ఇప్పటికే జరిగింది.

ఇందులో పలు చిత్రాలకు అవార్డులు వరించాయి. అయితే తాజాగా సీతా రామం, బలగం చిత్రాలకు కూడా స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కాయి. మరి ఈ సినిమాలకు ఏ క్యాటగిరీలో పురస్కారాలా ఉందాయనే వివరాల్లోకి వెళితే..

Balagam Sita Ramam Movie Wins 13th Dadasaheb Phalke International Film Awards 2023

వివిధ క్యాటగిరీలు: ఇండియన్ సినిమాలోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్. దీనికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సంవత్సరం వేడుకలు ఫిబ్రవరి 20న ముంబైలో ఘనంగా నిర్వహించారు. వివిధ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు హజరైన ఈ వేడుకలో పలు సినిమాలు వివిధ క్యాటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి.

Balagam Sita Ramam Movie Wins 13th Dadasaheb Phalke International Film Awards 2023

భార్యాభర్తలిద్దరికి: రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రానికి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించగా.. కాంతార హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టికి ప్రామిసింగ్ యాక్టర్ పురస్కారం అందుకున్నారు. బ్రహ్మస్త్రం సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణ్ బీర్ కపూర్ ను అవార్డు వరించగా.. అతని భార్య అలియా భట్ కు ఉత్తమ నటిగా గుంగుబాయి కఠియావాడి చిత్రానికి పురస్కారం లభించింది. అలాగే ఇదే చిత్రానికి ఉత్తమ ప్రతినాయకురాలిగా మౌనీ రాయ్ అవార్డు అందుకుంది.

Balagam Sita Ramam Movie Wins 13th Dadasaheb Phalke International Film Awards 2023

ఉత్తమ నటిగా ఆమె: బెస్ట్ మూవీగా కశ్మీర్ ఫైల్స్, బెస్ట్ డైరెక్టర్ గా ఆర్. బాల్కి (చుప్ సినిమా), మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా అనుపమ్ ఖేర్, క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ కింద వరుణ్ ధావన్ (బేడియా మూవీ), క్రిటిక్స్ ఉత్తమ నటిగా విద్యా బాలన్ (జల్సా చిత్రం), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సాచిత్ తాండన్, ఉత్తమ సహాయ నటుడిగా మనీష్ పాల్ (జగ్ జగ్ జీయో)లకు అవార్డులు వరించాయి.

Balagam Sita Ramam Movie Wins 13th Dadasaheb Phalke International Film Awards 2023

సీతా రామం అవార్డ్: అయితే తాజాగా 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టివల్ లో జ్యూరి క్యాటగిరీలో ఉత్తమ చిత్రంగా సీతా రామం అవార్డ్ అందుకుంది. అందమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకులు ఆదరించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇందులో సీతగా మృణాల్ ఠాకూర్ ఆకట్టుకోగా.. దుల్కర్ సల్మాన్ రామ్ గా అలరించాడు. అయితే దుల్కర్ సల్మాన్ కు ఇదివరకే చుప్ సినిమాకు గాను బెస్ట్ నెగెటివ్ రోల్ కింద అవార్డు వచ్చింది.

ఫాల్కే అవార్డుతోపాటు: 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్ 2023 అవార్డులో బలగం సినిమా కూడా పురస్కారం అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ సినిమాకు జ్యూరి క్యాటగిరీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ దక్కింది. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే బలగం చిత్రానికి లాస్ ఏంజిల్స్ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారాలు అందుకుంది. అలాగే ఒనిక్యో ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X