Balakrishna 50 Years: జై బాలయ్య ఓ మంత్రం.. హాలీవుడ్‌లోనూ ఈ జపం.. బాలయ్యపై బోయపాటి ఎమోషనల్
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక స్థానం. స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసి.. అయనకంటే ఘనంగా అంటే ఎక్కువ సంవత్సరాలు హీరోగా తెలుగు తెర మీద రాణించారు. దాదాపు హీరోగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. ఈ సందర్భంగా బాక్సాఫీస్ బొనాంజాకు టాలీవుడ్ ఘనమైన సత్కారం అందించింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

తెలుగు సినిమా పరిశ్రమలో కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించిన ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులతోపాటు టి సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కే రాఘవేంద్రరావు, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, నవీన్, రవిశంకర్, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. పరిశ్రమ అంత కలిసి ఇలా వచ్చినందుకు అభినందిస్తున్నాను. 110 సినిమాలు చేయడం చాలా కష్టం, 50 సంవత్సరాలు సినిమాలు చేసినందుకు అభినందనలు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు మీరు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాం అని అన్నారు.
సినీ పరిశ్రమలో జై బాలయ్య అనేది ఒక మంత్రం, అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకా ఇక్కడ ఉండదు. యూనివర్సల్ స్టూడియోలో కూడా జై బాలయ్య అంటున్నారు. చరిత్రకారులు అరుదుగా పుడతారు, అలా పుట్టిన ఎన్టీఆర్, ఏటువంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా వారికోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది, బాలయ్యకు పవర్ పెరుగుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











