మరోసారి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక.. చంద్రబాబు, పవన్, లోకేష్ హాజరు.. ఎప్పుడు? ఎక్కడంటే?
నటరత్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో భారీ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమాకు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ గైర్హాజరు అయ్యారు. అయితే బాలయ్య కోసం మరో వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ సిద్దమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో జరిగిన స్వర్ణోతవ వేడుకలో బాలకృష్ణతో సినిమాలు చేసిన దర్శకులతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, రానా, నాని, గోపీచంద్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాఘవేంద్రరావు, బీ.గోపాల్, పరుచూరి బ్రదర్స్, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, నిర్మాతలు డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, సుహాసిని, ఇంద్రజ, మాలశ్రీ, సుమలత తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.

అయితే ఈ అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిపి ప్రజా జీవితం స్తంభించడంతో ఆయా సహాయ కార్యక్రమాల్లో వారు నిమగ్నం కావడం వల్ల దూరంగా కావాల్సి వచ్చింది.
అయితే ఇప్పటికే బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానం ఆంధ్రాలో కూడా నిర్వహించాలని అభిమానులు నిర్ణయించారు. ఈ వేడుకను సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలో చంద్రబాబు, పవన్, లోకేష్‌తోపాటు ఎన్‌బీకే ఫ్యాన్స్ భారీగా పాల్గొంటారు.
హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ నిర్వహించిన వేడుకలో విజయేంద్ర ప్రసాద్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, గోపీచంద్, హాస్యనటుడు బ్రహ్మానందం, శివ బాలాజీ, రాజా రవీంద్ర, రఘు బాబు అలాగే నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, ఏషియన్ సునీల్, చెరుకూరి సుధాకర్, మైత్రి మూవీస్ రవి, దిల్రాజు, కేఎల్ నారాయణ, సురేష్ బాబు, జెమిని కిరణ్ పాల్గొన్నారు.

అదేవిధంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్ గారు, వైవిఎస్ చౌదరి గారు, చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అయిన దామోదర్ ప్రసాద్ గారు, భరత్ భూషణ్ గారు, ఫిలిం ఫెడరేషన్ నుండి అనిల్ గారు, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అనుపమ్ రెడ్డి గారు తదితరులు హాజరయ్యారు.
బాలకృష్ణ ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై బాలయ్య అనే నినాదాలు పలికారు. అలాగే నటులు నిరోషా, జీవిత రాజశేఖర్, మానశ్రీ తమిళ్ నుండి పి వాసు తదితర సినిమా ఇండస్ట్రీ పెద్దలు హారరావడంతో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.


Click it and Unblock the Notifications











