Akhanda Trailer: బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే.. వామ్మో ఇదే ఇలా ఉంటే అదేలా ఉంటుందో!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోతున్నారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని నటసింహా పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు. తాజాగా దీని నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'గా వస్తున్న బాలకృష్ణ

‘అఖండ'గా వస్తున్న బాలకృష్ణ

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ బడా దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

హిట్ కోసం అలాంటి సాహసంతో

హిట్ కోసం అలాంటి సాహసంతో

హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ' మూవీ కోసం బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా కనిపించబోతున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న స్టార్‌గా నిలిచారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇది ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలవబోతుంది.

 సీనియర్ హీరోల్లో నెంబర్ వన్‌గా

సీనియర్ హీరోల్లో నెంబర్ వన్‌గా

ఆ మధ్య 'అఖండ' మూవీ నుంచి టైటిల్ రోర్ వీడియో విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. సీనియర్ హీరోల చిత్రాల్లో దక్షిణ భారతదేశంలోనే టాప్‌కు చేరుకుంది.

అంచనాలకు తగ్గట్లే రికార్డులతో

అంచనాలకు తగ్గట్లే రికార్డులతో

'అఖండ' మూవీపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే, శాటిలైట్ డిజిటల్ రైట్స్‌కు అత్యధిక రేటు పలికింది.

బాలకృష్ణ అభిమానులకు కానుక

బాలకృష్ణ అభిమానులకు కానుక

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే 'అఖండ' మూవీ నుంచి ఏది వచ్చినా సెన్సేషన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ వీడియో రాబోతుందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీన్ని నవంబర్ 14, సాయంత్రం 7:09 గంటలకు ఇది విడుదల కాబోతుందని ఓ పోస్టర్‌ను విడుదల చేసి వెల్లడించింది.

ఇదే ఇలా ఉందంటే.. అదే ఎలా

ఇదే ఇలా ఉందంటే.. అదే ఎలా

ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేందుకు 'అఖండ' యూనిట్ వదిలిన పోస్టర్‌లో బాలయ్య విశ్వరూపం చూపించే ఫోజుతో కనిపించారు. దీంతో ఇదే ఇలా ఉంటే ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమా విడుదల తేదీ గురించి ట్రైలర్‌లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X