twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda: అక్కడ కూడా బాలయ్య సినిమా విడుదల.. ఇది మామూలు అరాచకం కాదుగా!

    |

    చాలా కాలంగా సరైన హిట్ లేక తెగ ఇబ్బందులు పడ్డారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అయినప్పటికీ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ, ఆయనకు బ్రేక్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. తనకు బాగా అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే చిత్రాన్ని చేశారు.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభం నుంచే భారీ స్పందనను అందుకున్న ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'అఖండ'ను మరో భాషలోనూ విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలు మీకోసం!

    ‘అఖండ'గా బాలయ్య అరాచకం

    ‘అఖండ'గా బాలయ్య అరాచకం

    నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చాడు. ఇది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

    సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!

    యాభై రోజుల ప్రస్థానంతో రికార్డు

    యాభై రోజుల ప్రస్థానంతో రికార్డు

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీ ఇటీవలే యాభై రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా ఏకంగా 105 సెంటర్లలో ఈ ఫీట్‌ను అందుకుంది. తద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువ థియేటర్లలో యాభై రోజులు ఆడిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఈ సుదీర్ఘమైన సినిమా ప్రయాణంలో హీరో బాలయ్య ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులు కూడా వచ్చి చేరాయి.

    Recommended Video

    Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
    అఖండ సినిమాకు లాభాలెంత?

    అఖండ సినిమాకు లాభాలెంత?

    బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్లకు పైగా రాబట్టింది. ఫలితంగా రూ. 20 కోట్లకు పైగా లాభాలను కూడా అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది.

    రిపబ్లిక్ డేన బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!రిపబ్లిక్ డేన బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!

    ఓటీటీలో విడుదల.. రికార్డు బ్రేక్

    ఓటీటీలో విడుదల.. రికార్డు బ్రేక్

    'సింహా', 'లెజెండ్' తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఇక, జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఓటీటీలోనూ చరిత్రను సృష్టించింది.

    అక్కడ కూడా అఖండ విడుదల

    అక్కడ కూడా అఖండ విడుదల

    ప్రతికూల పరిస్థితుల్లోనూ విడుదలైన 'అఖండ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ను అందుకుని సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను తమ తమ భాషల్లోకి డబ్బింగ్ చేసుకోడానికి ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్బింగ్ చేసి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

    ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

    రిలీజ్ డేట్ పోస్టర్‌తో అరాచకం

    రిలీజ్ డేట్ పోస్టర్‌తో అరాచకం

    'అఖండ' మూవీ తమిళ వెర్షన్‌ను జనవరి 28 అంటే రేపు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన తమిళ పోస్టర్‌ ఒకటి బయటకు వచ్చింది. దీన్ని అక్కడ కూడా భారీ స్థాయిలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి తెలుగు ప్రేక్షకుల మాదిరిగా తమిళ ఆడియెన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

    English summary
    Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. Now This Movie Tamil Version release on January 28th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X