For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్య చేతిలో మళ్లీ మెగాఫోన్... బ్లాక్‌బస్టర్‌ మూవీ సీక్వెల్‌కు డైరెక్షన్!

  |

  నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈపాటికి సినిమా రిలీజ్ పనులు ముమ్మరంగా సాగుతుండేవి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే నిన్న బాలయ్య పుట్టిన రోజు సంధర్భంగా మరో కీలక విషయాన్ని వెల్లడించారు ఆయన. ఆ వివరాల్లోకి వెళితే

  Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
  హిట్ వేటలో

  హిట్ వేటలో

  2016 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆయన దాదాపు నాలుగైదు సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. తన తండ్రి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన కధానాయకుడు, మహానాయకుడు సినిమాలు కూడా సరైన స్పందన తెచ్చుకోలేక పోయాయి. చివరికి ఆయన తనకు రెండు హిట్ సినిమాలు అందించిన బోయపాటితో సినిమా ప్లాన్ చేశారు.

  కలిసొచ్చిన డైరెక్టర్ తో

  కలిసొచ్చిన డైరెక్టర్ తో

  సింహా, లెజెండ్ లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తెరకెక్కుతున్న అఖండ అనే సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో సినిమా ప్రారంభించనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా నిన్న వెలువడింది.

  బర్త్ డే స్పెషల్

  బర్త్ డే స్పెషల్

  నిన్న బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఒక తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తాను మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నట్లుగా సూచనలు చేశారు.. నిజానికి ఈ అంశం తన కుమారుడు సినీ ఎంట్రీ గురించి ప్రస్తావనకు వచ్చినా తాను మెగాఫోన్ పట్టుకునే అవకాశాలు ఉన్నాయని బాలకృష్ణ తేల్చిచెప్పారు. బాలయ్య గతంలో హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమా సీక్వెల్ తెరకెక్కుతోంది అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.. నిన్న పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో బాలయ్య ఈ విషయాన్ని వెల్లడించారు.

  మళ్ళీ మెగాఫోన్

  మళ్ళీ మెగాఫోన్

  తాను ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.. సినిమా కథ చెప్పమంటే సింగీతం శ్రీనివాసరావు అప్సరసలు అంటూ ఏదో చెప్పారని కానీ తనకు అది నచ్చలేదు అని ఆయన అన్నారు. వాళ్లకు తానే ఒక సబ్జెక్ట్ చెప్పానని ఆ సబ్జెక్ట్ బాగా నచ్చడంతో అదే చేద్దామని సింగీతం శ్రీనివాస రావు ఫిక్స్ అయ్యారు అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాక చేస్తే తానే డైరెక్షన్ చేస్తానని తాను చేయని పక్షంలో మీరు తప్ప మరో దర్శకుడికి ఇవ్వద్దని తనను కోరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి బాలయ్య దర్శకుడిగా నర్తనశాల సినిమా చేయాల్సి ఉంది. సౌందర్య మరణంతో ఈ సినిమా ఆగిపోయింది.

  టైటిల్ అదేనా

  టైటిల్ అదేనా

  ఆ తరువాత ఈ సినిమా కోసం బాలకృష్ణ మెగాఫోన్ పట్టుకోవడం ఖాయం అని అంటున్నారు.. ఎలా అయితే తన తండ్రి తనను తాతమ్మకల సినిమాతో సినిమా రంగంలోకి తీసుకువచ్చారో తాను కూడా తన కుమారుడిని ఈ సినిమా ద్వారా తీసుకువచ్చి తనకు తెలిసిన అన్ని మెళకువలు నేర్పిస్తా అని ఆయన చెప్పుకొచ్చారు.. తండ్రి డైరెక్షన్లో తండ్రితో పాటు నటిస్తూ మోక్షజ్ఞ తేజ నటన నేర్చుకుంటానని బాలకృష్ణ వెల్లడించారు. ఇక ఈ సినిమా టైటిల్ గా ఆదిత్య 999 అనే ఇది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. మరి ఈ టైటిల్ తోనే ముందుకు వెళ్తారా లేక టైటిల్ మారుస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  Balakrishna all set to make his directorial debut with adithya 369 sequel. on the occasion of his birthday he revealed in an exclusive interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X