నయనతార ఊర్వశి.. శృతిహాసన్ రాక్షసి.. బాలకృష్ణ హాట్ కామెంట్స్

అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రాకేష్ శశి దర్శకత్వంలో జిఏ 2 పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం రోజు గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా నందమూరి బాలకృష్ణ వచ్చిన విషయం తెలిసిందే. ఇక వేడుకలో బాలకృష్ణ అల్లు శిరీష్ కు మధ్య కొనసాగిన సంభాషణ కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సంభాషణలో అల్లు శిరీష్ బాలకృష్ణను కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు కూడా అడిగారు. ఆ వివరాల్లోకి వెళితే..

బాలయ్యకు అల్లు శిరీష్ ప్రశ్నలు

బాలయ్యకు అల్లు శిరీష్ ప్రశ్నలు

ప్రతి సినిమా ఈవెంట్లో కూడా సుమ గారు హీరోలను ప్రశ్నలు అడుగుతారు. కానీ నేను ఈ వేడుకలో బాలకృష్ణ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నట్లు శిరీష్ మొదలు పెట్టాడు. ఇక బాలకృష్ణ అయితే చాలా సరదాగా అల్లు శిరీష్ కి కొన్ని హెచ్చరికలు చేశాడు. నాకేమో స్టాప్ ద్వారా మైక్ అలవాటు చేశారు. ఇక ఇప్పుడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నావు అని నవ్వుకుంటూ బాలయ్య పంచ్ వేశారు.

నన్ను కొట్టకూడదు సార్

నన్ను కొట్టకూడదు సార్

ఇక మా సినిమా ఊర్వశివో..రాక్షశివో అనే టైటిల్ కు తగ్గట్టుగానే మీరు వర్క్ చేసిన హీరోయిన్స్ లలో ఎవరు ఊర్వశి ఎవరి రాక్షసి అనే విషయాన్ని చెప్పాలి అని శిరీష్ ప్రశ్నించాడు. అంతేకాకుండా ఇలాంటి ప్రశ్న అడిగినందుకు నన్ను కొట్టకూడదు సార్ అని శిరీష్ సరదాగా ప్రశ్నించాడు. ఇక అందరి పేర్లు ఒకేసారి చెప్పాలి అని బాలయ్య అడగడంతో విజయశాంతి సిమ్రాన్ శృతిహాసన్ నయనతార వీరిలో ఊర్వశి, రాక్షసి ఎవరెవరు అని అల్లు శిరీష్ అడిగాడు.

ఆమె ఊర్వశి

ఆమె ఊర్వశి

ఇక మొదటగా నయనతార ఊర్వశి అని సమాధానం చెప్పిన బాలయ్య శ్రుతిహాసన్ రాక్షసి అని సమాధానం ఇచ్చారు. నువ్వు రెండే అడిగావు కాబట్టి వాటికి సమాధానం చెప్పాను అని బాలయ్య మళ్ళీ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఇక మీ సినిమాలలో సింహం అనే టైటిల్ తో ఉన్నవి కొన్ని ఉన్నాయి అందులో నేను చెప్పనిది మీరు ఒకటి చెప్పాలి అని అన్నప్పుడు బాలయ్య బాబు బొబ్బిలి సింహం అని అన్నారు. అంతేకాకుండా సింహం నవ్వింది అనే సినిమా కూడా చేశారని శిరీష్ అన్నారు. దీంతో అందుకే ఆ సినిమా పోయింది అని బాలయ్య మళ్ళీ సరదాగా నవ్వించారు.

నీలో ఒక కొంటె కృష్ణుడు

నీలో ఒక కొంటె కృష్ణుడు

ఇక మీకు నాకు మధ్యలో రెండు కామన్ విషయాలు ఉన్నాయని అల్లు శిరీష అన్నాడు. నేనైతే బయట బాలయ్య అని ఇంట్లో మొగుడిని అని అన్నారు. అలాగే బాలయ్య బాబు అల్లు శిరీష్ పెళ్లి గురించి కూడా ప్రశ్నించాడు. అంతేకాకుండా మన రాశి కూడా ఒకటే అని చెప్పిన బాలయ్య నీలో ఒక కొంటె కృష్ణుడు ఉన్నాడు నేను మాత్రం రౌడీ రాముడు అని అన్నారు.

నిజజీవితంలో కూడా ఇంతేనా

నిజజీవితంలో కూడా ఇంతేనా

అలాగే భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాల్లో కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని అల్లు శిరీష అడగడంతో అందుకు బాలకృష్ణ పరశురామ్ వైపు చూసి ఆయనని అడగాలి అని అన్నారు. తప్పకుండా భవిష్యత్తులో నన్ను అతను చెడగొట్టే పాత్రనో.. నేను అతడిని చెడ్డగొట్టే పాత్రనో ఏదో ఒకటి చేద్దాం అని కూడా సరదాగా సెటైర్ వేశారు. ఇక సినిమా ట్రైలర్లో అల్లు శిరీష్ పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంది అని చెప్పిన బాలయ్య నిజజీవితంలో కూడా ఇంతేనా అని ప్రశ్నించాడు. అయితే నేను మాత్రం బయట అలా ఉండను అని అల్లు శిరీష్ మళ్లీ నవ్వుతూ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X