NBK108: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన సినిమాలతో ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ ముందుకు సాగుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు హిట్‌గా నిలిచింది.
చాలా రోజుల క్రితమే నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. 'వీర సింహా రెడ్డి' సినిమా వచ్చిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అలాగే, జనవరి చివరి వారం నుంచే కొత్త షెడ్యూల్ అనుకున్నా.. తారకరత్న మరణం కారణంగా బాలయ్య షూటింగ్‌లో పాల్గొనలేనని చెప్పారు. దీంతో దీనికి కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకు తగ్గట్లుగానే అనిల్ రావిపూడి స్పీడుగా షూటింగ్‌ను పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











