NBK 109: బాలయ్య బాబు కోసం నాని బ్యూటీని రంగంలోకి దింపిన బాబీ.. ఈసారి హిట్టు కన్ఫార్మ్!

టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ సీనియర్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. హిట్ల పై హిట్లు కొడుతూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు బాలయ్య బాబు. అఖండ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగానే నిలిచాయి. దీంతో ఆయన సినిమా వస్తుందంటే చాలు ఈ సారి కూడా హిట్టు కన్ఫార్మ్ అని ఫిక్స్ అయిపోతున్నారు.

ముఖ్యంగా ఆ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, ఏం చేస్తున్నారనే అప్ డేట్లు తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు కాగా.. ఇప్పటికే ఇద్దరు ఫిక్స్ అయ్యారు. తాజాగా బాలయ్య బాబు కోసం నాని బ్యూటీని డైరెక్టర్ బాబీ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

Balakrishna And Bobby Combo Film NBK 109 Heroine Confirm Check Details

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా కావడంతో.. ఈ చిత్రాని NBK 109 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. బాలయ్య బాబు, బాబీ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్నమైన గెటప్‌లలో కనిపించబోతున్నారట. ఇవన్నీ ఎంతో వైవిధ్యంగా ఉంటాయని, గతంలో ఆయన కనపించని విధంగా డిజైన్ చేశారని టాక్.

అలాగే బాలకృష్ణ కనిపించే మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లను కూడా ఫిక్స్ చేశార. ఇప్పటికే ఇద్దరిని కన్ఫార్మ్ చేయగా.. తాజాగా మరో ముద్దుగుమ్మను రంగంలోకి దించారు. త్రిష, మీనాక్షి చౌదరిలు ఈ సినిమాలో చేస్తుండగా.. తాజాగా జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ను కూడా ఈ సినిమాలోకి తీసుకున్నారట. తాజాగా క్యూట్ బ్యూటీ ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుందట.

Balakrishna And Bobby Combo Film NBK 109 Heroine Confirm Check Details

హై ఓల్టేజ్ యాక్షన్‌తో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లు హీరోయిన్లుగా కనిపిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తుందని అంతా అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X