NBK109: బాలయ్య నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేలా వీడియో
ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఆయన 'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్‌లో పెడుతున్నారు.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్రతో తన 109వ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందుతోంది. డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ చిత్రీకరణ జరిపారు. ఇలా దీనికి సంబంధించి చాలా టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా సన్నాహాలు చేసుకుంటున్నారు.
డిఫరెంట్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ అయినా దీని సంబంధించిన అప్‌డేట్లు మాత్రం పెద్దగా రాలేదు. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోను వదిలారు. దీనికి నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది.

బాలకృష్ణ - బాబీ కలిసి చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌పై ఈ మధ్య ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత నాగ వంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ టీజర్‌ను బాలయ్య బర్త్‌డే కానుకగా జూన్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు, ఇది ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంటుందని కూడా చెప్పాడు. దీంతో బాలయ్య టీజర్‌పై అంచనాలు పెరిగిపోతోన్నాయి.
ఇదిలా ఉండగా.. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా, దుల్కర్ సల్మాన్, చాందినీ చౌదరి తదితరులు నటిస్తున్నారు. థమన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











