For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK107: బాలకృష్ణ అఖండ సెంటిమెంట్.. ‘జై బాలయ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగొందుతూ హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగారు. అలా సుదీర్ఘ కాలంగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో బాలయ్య వరుస పరాజయాలతో సతమతం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత ఏడాది ఆయన 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఘన విజయాన్ని దక్కించుకుంది. అంతేకాదు, ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది.

    లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

    'అఖండ' ఫలితంతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ఈ ఉత్సాహంతోనే టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'జై బాలయ్య' (పరిశీలనలో ఉన్న టైటిల్) చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రియల్ స్టోరీల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వాస్తవానికి ఈ భారీ ప్రాజెక్టు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలు పెట్టలేకపోయారు. ఇక, ఫిబ్రవరి నుంచే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఇలా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా వరకూ షూటింగ్ పూర్తైంది.

    Balakrishna and Gopichand Movie Release on December 2nd

    బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి కొత్త షెడ్యూల్‌ను జూలై 24 నుంచి కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించబోతున్నారు. ఆ వెంటనే టర్కీ వెళ్లి అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు పాటను కూడా షూట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

    దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనికి కారణం గత ఏడాది అదే రోజున 'అఖండ' సినిమా విడుదలైంది. అంతేకాదు, ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సెంటిమెంట్ ప్రకారమే ఇప్పుడు 'జై బాలయ్య'ను కూడా డిసెంబర్ 2నే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వర్కౌట్ అయితే బాలయ్య కెరీర్‌లో మరో విజయం వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

    ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక, దీని నుంచి వచ్చిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది.

    English summary
    Nandamuri Balakrishna Now Doing His 107th Film with Gopichand Malineni. This Movie Title Poster Will Release on July Last Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X