NBK107: బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. లయన్ వేటకు ముహూర్తం ఫిక్స్

'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత నుంచి హిట్ కోసం వేచి చూస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో విజయం కోసం ఆయన ఎన్నో చిత్రాలను చేస్తూ వచ్చారు. కానీ, అవేమీ ఆయనను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేదు. ఈ క్రమంలోనే గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, భారీ వసూళ్లతో బాలయ్య తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు, ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఏకంగా 105 సినిమాల్లో యాభై రోజుల పాటు ప్రదర్శితమై అరుదైన ఘనతను అందుకుంది.

'అఖండ' సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుస పెట్టి లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే గోపీచంద్ మలినేనితో చేసే సినిమాను ప్రారంభించబోతున్నారు. గత ఏడాది రవితేజ నటించిన'క్రాక్'తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ దర్శకుడు.. ఆ వెంటనే బాలయ్య కోసం నిజ జీవిత సంఘటనలతో కూడిన మరో పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడు. అంతేకాదు ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కనుందనే ప్రచారం జోరుగానే సాగుతోంది.

Balakrishna and Gopichand Movie Start From February 16th

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్‌ను మొదలు పెట్టలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కాబోతుందని తెలిసింది. మొదటి జరిగే షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్లాన్ చేశారని అంటున్నారు. ఆ తర్వాత వేటపాలెం ఏరియాలో చిత్రీకరణ జరుపుతారనే టాక్ కూడా వినిపిస్తోంది.

నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఇందులో భాగంగానే వరుసగా కొన్ని షెడ్యూళ్లను కూడా ఇప్పటికే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్లు డేట్స్‌ను బట్టి ఈ సినిమా చిత్రీకరణను జరుపుతారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా వేటపాలెం నేపథ్యంతో రాబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమా కోసం దర్శకుడు ప్రకాశం జిల్లా చరిత్రను కూడా తిరగేశాడు. ఇలా చాలా కాలం కష్టపడిన తర్వాత ఎంతో పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడు.

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో.. అతడికి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X