NBK107: బాలయ్య కోసం ప్లాన్ మార్చిన గోపీచంద్.. తెలంగాణ గడ్డపైనే తొలి అడుగు
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో టాలీవుడ్ టాప్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత నుంచి హిట్ కోసం వేచి చూస్తున్నారాయన. ఇలాంటి పరిస్థితుల్లో విజయం కోసం ఆయన ఎన్నో చిత్రాలను చేస్తూ వచ్చారు. కానీ, అవేమీ ఆయనను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేదు. ఈ క్రమంలోనే గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, భారీ వసూళ్లతో బాలయ్య తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
'అఖండ' విజయం ఇచ్చిన జోష్‌తో ఉన్న బాలయ్య.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుస పెట్టి లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాది రవితేజ నటించిన'క్రాక్'తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ డైరెక్టర్.. ఆ వెంటనే బాలయ్య కోసం రియాలిటీతో కూడిన మరో పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడు. అంతేకాదు, ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్ర యూనిట్ మాత్రం చిత్రీకరణను మొదలు పెట్టలేదు. దీంతో అసలు ఇది ఎప్పుడు మొదలు అవుతుందా అని నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య - గోపీచంద్ కలయికలో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కాబోతుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరింత సమాచారం తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ను తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలు పెట్టబోతున్నారట. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలతో దీన్ని షురూ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో బాలయ్యతో పాటు ముఖ్యమైన నటీనటులు భాగం కానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు 20 రోజుల పాటు సాగబోతుందని తెలిసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో.. హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











