NBK107: వేట మొదలు పెట్టిన బాలయ్య.. ఆ ఊరిలో గోపీచంద్ మూవీ షూట్

హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోన్న టాలీవుడ్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలను పట్టించుకోని ఆయన.. కథతో వచ్చిన ఏ దర్శకుడినీ కాదనకుండా మూవీలు చేస్తారన్న పేరు తెచ్చుకున్నారు. అదే ఈ సీనియర్ హీరోకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాలయ్య చాలా పరాజయాలను చవి చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో 'అఖండ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

'అఖండ'మైన విజయాన్ని అందుకున్న జోష్‌తో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుస పెట్టి లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బాలయ్య కోసం నిజజీవిత సంఘటనలతో కూడిన ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారని అంటున్నారు.

 Balakrishna and Gopichand Movie Starts at Sircilla

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ, బాలయ్యకు సర్జరీ జరగడంతో పాటు మరికొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్‌ను మొదలు పెట్టలేదు. దీంతో అసలు ఇది ఎప్పుడు మొదలవుతుందో అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య - గోపీచంద్ కలయికలో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కాబోతుందని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయింది. దీన్ని తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో నిరాడంబరంగా మొదలు పెట్టారు. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలతో దీన్ని షురూ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో బాలయ్యతో పాటు ముఖ్యమైన నటీనటులు భాగం కానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు 20 రోజుల పాటు సాగబోతుందని తెలిసింది. దీని తర్వాత షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుందని అంటున్నారు.

పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X