NBK107 First Hunt: పవర్‌ఫుల్ పోస్టర్‌తో టీజర్ అప్‌డేట్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ అన్నింటికీ మించి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అదే సమయంలో తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక, చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయిన బాలయ్య.. గత ఏడాది చివర్లో 'అఖండ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు.

'అఖండ' మూవీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొన్ని నెలల క్రితమే 'క్రాక్' అనే సినిమాతో సక్సెస్‌ను అందుకున్న గోపీచంద్ మలినేనితో సినిమాను ప్రకటించారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. దీనికోసం గోపీచంద్ లైబ్రెరీలలో ఉన్న పాత సంఘటనలను కూడా ఆధారంగా తీసుకున్నాడు. ఇది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలు పెట్టలేకపోయారు.

Balakrishna and Gopichand Movie Teaser Date and Time

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టి అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇందులో బాలయ్య తెల్ల పంచె, నలుపు రంగు షర్ట్‌తో పవర్‌ఫుల్ గెటప్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఇది ఫ్యాన్స్‌కు మరోసారి ఫుల్ మీల్స్ పెట్టే చిత్రం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.

నటసింహా నందమూరి బాలకృష్ణ జూన్ 10న పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని పురస్కరించుకుని గోపీచంద్ మలినేని తెరకెక్కించే సినిమా నుంచి NBK107 First Hunt పేరుతో టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీన్ని జూన్ 9న విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. ఇక, తాజాగా ఈ టీజర్‌ను ఈరోజు సాయంత్రం 6:11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా వదలారు. అందులో 'పులిచర్ల 4 కి.మీ' అనే రాయిపై రక్తపు మరకలు, దాని పక్కనే స్పెషల్‌గా డిజైన్ చేసిన గొడ్డలిని చూపించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ ఇచ్చే ట్రీట్ రాబోతుందని అర్థం అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X