NBK107: బాలయ్య సినిమా టైటిల్ కొత్తగా.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
గత ఏడాది 'అఖండ' వంటి బంపర్ హిట్ కొట్టిన తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ సీనియర్ హీరో వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పటికే బాలయ్య.. 'క్రాక్'తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఆరంభంలోనే ఈ మూవీపై అందరి దృష్టి పడిపోయింది. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.
పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చేసింది.

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య - గోపీచంద్ మూవీకి సంబంధించిన టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో డేట్లు, టైటిళ్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఇందులో ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేసేందుకు ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. దీన్ని అక్టోబర్ 21వ తేదీన రాత్రి 8.15 గంటలకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర నిర్వహించబోతున్నట్లు కూడా తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ ఏ సినిమాకు కూడా టైటిల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించలేదు. దీంతో బాలయ్య పేరిట మరో రికార్డు నమోదైంది.
ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, ఎస్ థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. దీన్ని సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











