twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK107: ఫ్యాన్స్‌కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్.. అసలైందే రాబోతుందిగా!

    |

    చాలా కాలం పాటు విజయాలు లేకపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆయనకు గత ఏడాది వచ్చిన 'అఖండ' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఉత్సాహంతోనే బాలయ్య తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'జై బాలయ్య' (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమాను చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

    షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

    గోపీచంద్ - బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే టర్కీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ రొమాంటిక్ సాంగ్‌ను సైతం షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య అభిమానులకు కిక్కిచ్చే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    Balakrishna and Gopichand Movie Title Poster Release Soon

    క్రేజీ కాంబినేషన్ కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన టీజర్ వల్ల ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా నేడో, రేపో రాబోతుందని తెలిసింది. ఇది నిజంగా బాలయ్య ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్ ట్రీటే అని చెప్పాలి.

    Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

    గోపీచంద్ మలినేని తెరకెక్కించే సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.

    English summary
    Nandamuri Balakrishna Now Doing His 107th Film with Gopichand Malineni. This Movie Title Poster will Release This Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X