NBK107: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టైటిల్ పోస్టర్ ఎప్పుడో తెలిస్తే!

బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగారు నటసింహా నందమూరి బాలకృష్ణ. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న ఆయన.. సుదీర్ఘ కాలంగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత బాలయ్యకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఈ పరిస్థితుల్లోనే గత ఏడాది ఆయన 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. అంతేకాదు, బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లను రాబట్టింది.

'అఖండ' సక్సెస్ తర్వాత మాంచి జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ.. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమాను చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. దీనికోసం గోపీచంద్ ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న లైబ్రెరీలలో పాత న్యూస్ పేపర్లను కూడా ఆధారంగా తీసుకున్నాడు. ఇది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బాలయ్య ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలు పెట్టలేకపోయారు. ఇక, ఫిబ్రవరి నుంచే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది.

బాలయ్య - గోపీచంద్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక, ఇప్పుడు బాలయ్య దాని నుంచి కోలుకోవడంతో త్వరలోనే దీన్ని పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో జూలై 24 నుంచి కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఆ వెంటనే టర్కీ వెళ్లి అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు పాటను కూడా చిత్రీకరించేలా ప్లాన్ చేసుకున్నారు.

Balakrishna and Gopichand Movie Title Poster Update

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి పవర్‌ఫుల్ టైటిల్ పెట్టబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గురించి కూడా చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి 'వీర సింహా రెడ్డి', 'జై బాలయ్య' అనే టైటిళ్లలో ఒకటి పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను జూలై చివరి వారంలో విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది.

బాలకృష్ణ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక, దీని నుంచి వచ్చిన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X