Don't Miss!
- News
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కానుక-మన విద్యార్ధులకు 75 స్కాలర్ షిప్ లు ప్రకటించిన బ్రిటన్
- Technology
భారత మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుదల.. ధర ఎంతంటే!
- Finance
Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు..
- Automobiles
ఆటమ్ వాడెర్ ఇ-బైక్‌ని లాంచ్ చేసిన హైదరాబాద్ కంపెనీ.. మొదటి 1000 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్!
- Sports
India vs England 5th Test Weather : తొలి రోజు వర్షార్పణమే.. ‘టెస్ట్’ పెట్టనున్న వరుణ దేవుడు..!
- Lifestyle
ఈ 5 రాశుల తండ్రులు వారి పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు..అందుకే చెడ్డ నాన్నలు కావచ్చు...
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
NBK107: బాలయ్య ఫ్యాన్స్‌కు ఉగాది కానుక.. అదిరిపోయే సర్‌ప్రైజ్ రెడీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. ఎంతో మంది దర్శకులతో సినిమాలు చేశారు. దీంతో చాలా విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఈ మధ్య కొంత కాలం పాటు బాలయ్యకు సక్సెస్ చేరువ కాకుండానే వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది విడుదలైన 'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రియుడికి శృతి హాసన్ సర్‌ప్రైజ్: స్పెషల్ డేన ఆ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసి మరీ!
బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' మూవీతో భారీ విజయాన్ని అందుకున్న జోష్‌తో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను అంతే ఉత్సాహంగా జత చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా చేసిన 'క్రాక్'తో బిగ్ సక్సెస్ కొట్టిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బాలయ్య కోసం రియాలిటీతో కూడిన ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. అంతేకాదు, ఈ సినిమా పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

గోపీచంద్ - బాలయ్య కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, బాలయ్యకు సర్జరీ జరగడంతో పాటు మరికొన్ని అనివార్య కారణాల వల్ల యూనిట్ మాత్రం షూటింగ్‌ను త్వరగా ప్రారంభించలేదు. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టి అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.
స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట
క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితమే బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. దీనికి ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే చిత్ర యూనిట్ ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ను రెడీ చేసేసిందట. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అంటున్నారు. ఇక, ఈ సినిమా కోసం 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.