NBK107: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్
ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, స్టార్‌డమ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే భారీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న ఆయన.. దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇలా చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డ బాలయ్య.. గత ఏడాది చివర్లో 'అఖండ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్‌ను దక్కించుకుంది.
'అఖండ' వంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఉత్సాహంతో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను అంతే జోష్‌తో లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే 'క్రాక్'తో సక్సెస్ కొట్టిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బాలయ్య కోసం నిజజీవిత సంఘటనలతో కూడిన ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమా పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు.

గోపీచంద్ - బాలయ్య కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, బాలయ్యకు సర్జరీ జరగడంతో పాటు మరికొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేయలేదు. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశను ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టారు.
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైన రోజే.. సెట్స్ నుంచి బాలయ్య గెటప్‌తో కూడిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఇందులో ఆయన రఫ్ లుక్‌తో కనిపించారు. దీంతో ఇవి కాస్తా చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఇందులో ఈరోజు సాయంత్రం 4.26 గంటలకు నటసింహం వస్తున్నారు అంటూ వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో బాలయ్య లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను వదలబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. దీన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











