Just In
- 5 hrs ago
హైదరాబాద్‌లో కంగనాకు చేదు అనుభవం.. బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని వెళ్లినా వదల్లేదట.!
- 6 hrs ago
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్.. ఈ సారి అదిరిపోతుందట.!
- 7 hrs ago
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- 8 hrs ago
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ షాకింగ్ డెసిషన్.. ఆనంద్ కోసం ఆ పని కూడా చేస్తాడట
Don't Miss!
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
బాబాయ్‌తో సమరానికి సిద్దమవుతున్న అబ్బాయ్.. 'ఎంతమంచి వాడవురా'
ఓ పక్క బాబాయ్ జోరుగా షూటింగ్లో పాల్గొంటుంటే.. మరో పక్క అబ్బాయ్ వేగంగా తన సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఇద్దరూ సంక్రాంతి సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ బాబాయ్, అబ్బాయ్ ఎవరనేది. అదేనండీ నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్. ఈ ఇద్దరూ సంక్రాంతినే టార్గెట్ చేసి బరిలోకి దిగారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా 'ఎంతమంచి వాడవురా' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జులై 31 వ తేదీన రెగ్యులర్ షూట్ ప్రారంభించుకొని ఆగస్టు 17న తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్‌ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు మేకర్స్.

అయితే 'ఎంతమంచి వాడవురా' సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని తాజాగా చిత్రయూనిట్ ప్రకటించడంతో బాబాయ్‌తో సమరానికి అబ్బాయ్ రెడీ అయ్యాడని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు. ఉమేష్ గుప్త సమర్పణలో సతీష్ వేగేశ్న దర్శకత్వం 'ఎంతమంచి వాడవురా' సినిమా రూపుదిద్దుకుంటోంది. చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇది 17 వ సినిమా. చిత్రానికి గోపిసుందర్ సంగీతం బాణీలు కడుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఎంత మంచివాడవురా! సినిమా టైటిల్ పోస్టర్, వీడియో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.