Bhagavanth Kesari Video: ఫ్యాన్స్‌కు సర్రైజ్ వచ్చేసింది... బాలయ్య నోట పవర్ ఫుల్ డైలాగ్
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా... టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. బాలయ్యకు కూతురి పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇక ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఇక ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలవనుందని ఇప్పటికే రిలిజ్ అయిన పాటను చూస్తే అర్ధం అవుతుంది.

ఇక భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకు పోటీగా విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించారు. బాలయ్యకు జోడిగా చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఇక భగవంత్ కేసరి మూవీలో మొదటి సారిగా బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నరు. ఇక ఈ మూవీలో బాలయ్యను మునుపెన్నడు చూడని పాత్రలో చూస్తారని ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకువచ్చారు. ఇక తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ నెక్ట్ లెవెల్ అని... అఖండ, వీరసింహ రెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హాట్రిక్ ఖాయమని అభిమానులు అంటున్నారు.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇక ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ తో ప్రేక్షకును సర్ ప్రైజ్ చేసింది. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పూర్తైపోయినట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్. 'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి' పేరుతో .. షూటింగ్ సెట్ లోని మేకింగ్ వీడియోను పంచుకున్నారు మేకర్స్.
8 నెలలు.. 24 అద్భుత లొకేషన్స్.. 12 భారీ సెట్స్‌లో సినిమాను చిత్రీకరించినట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోలో క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు సెట్లో జరిగిన విషయాలను చూపించారు. కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, బాలయ్యపై చిత్రీకరించిన సీన్స్ ను చూపించారు. యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ వీడియోలో బాలయ్య మాస్ లుక్ లో కనిపించారు.
ఇక ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరె లెవెల్ అని చెప్పవచ్చు. కలిసి మాట్లాడుతా అన్న కదా... అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడం... హైలెట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











