సీనియర్ రైటర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. మరోసారి ఆ దర్శకుడితోనే..

టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ఆడియెన్స్ కి సరిపడే డైలాగ్స్ గాని యాక్షన్ ఎపిసోడ్స్ గాని లేకపోతే కిక్కు ఉండదు. ఇక ప్రయోగాలు చేసే టైమ్ లో సినిమాను జనాల్లోకి ఎలా తీసుకు వెళ్లలో ఆయనకు బాగా తెలుసు. ఇక ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతోనే బిజీగా ఉన్న ఈ స్టార్ నటుడు బోయపాటి సినిమా అనంతరం వెంటనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. అయితే ముందుగా ఎవరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది సస్పెన్స్ గా మారింది.

బోయపాటి దర్శకత్వంలో మూడవసారి సినిమా చేస్తున్న బాలయ్య బాబు ఆ సినిమాపై నమ్మకం గట్టిగానే పెట్టుకున్నాడు. ఇక తరువాత వీలైనంత వరకు ప్రయోగాలకు వెళ్ళకుండా మరిన్ని మంచి సినిమాలు చేసుకోవడం బెటర్ అని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక బి.గోపాల్ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు చాలా సార్లు టాక్ వచ్చింది గాని ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సీనియర్ రైటర్ కోన వెంకట్ చెప్పిన ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

Balakrishna another projects on discussion

దర్శకుడిగాక్ శ్రీవాస్ అయితే ఆ కథకు సరైన న్యాయం చేయగలడు అని బాలయ్య కోన వెంకట్ కి సలహా ఇచ్చారట. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తరహాలో ఇంతకుముందే బాలకృష్ణతో డిక్టేటర్ అనే సినిమా చేశాడు. ఇక అప్పటి నుంచి బాలయ్య ఈ దర్శకుడితో సినిమా చేయాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఇక కోన వెంకట్ కథ సెట్ చేయడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఒప్పేసుకున్నారట. బోయపాటి ప్రాజెక్ట్ అనంతరం శ్రీవాస్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బి.గొపాల్ ప్రాజెక్ట్ విషయంలో బాలయ్య ఇంకా ఎలాంటి డిసిషన్ తీసుకోలేదని సమాచారం. మరి రానున్న రోజుల్లో బాలయ్య ఎలాంటి సినిమాలు రిలీజ్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X