మరో హిస్టారికల్ సినిమాలో బాలకృష్ణ.. సీనియర్ దర్శకుడితో భారీ ప్లాన్

నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలు చేసినా కూడా తగిన న్యాయం చేయగలరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జానపద, పౌరాణిక పాత్రలతో ఆయన ఊహించని విధంగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ లో హిస్టారికల్ సినిమాలకు బాలయ్య కరెక్ట్ గా సరిపోతాడాని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇటీవల మరో హిస్టారికల్ సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాకతీయ సామ్రాజ్యంలో ఎంతగానో గుర్తింపు అందుకున్న గోన గన్నా రెడ్డి పాత్ర ఆధారంగా ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ దర్శకుడు కొంతమంది ప్రముఖ రచయితలతో కలిసి పూర్తి కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు బి.గోపాల్ అనే టాక్ కూడా వస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా బాలకృష్ణతో సినిమా చేయాలని ట్రై చేస్తున్న గోపాల్ ఆడియెన్స్ ని సరికొత్తగా ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు. అందుకే గోన గన్నారెడ్డి కథను రెడీ చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

Balakrishna Balakrishna upcoming movie based on gona gannareddy

ఇక గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రను చేసిన విషయం తెలిసిందే. బన్నీ పాత్ర హైలెట్ అయినప్పటికీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు బాలకృష్ణ ఆ పాత్రను పూర్తి స్థాయిలో సినిమాగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X