Bhagavanth Kesari: ఐదు వారాలు దాటినా ఆగని బాలయ్య జోరు.. బాక్సాఫీసు బద్ధలేగా!

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు పదుల వయసులోనూ బాలయ్య బాబు అద్భుతంగా నటిస్తూ... అందరినీ అలరిస్తున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాల్లో మెరుస్తూ.. ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు. అఖండ సినిమాకంటే ముందే అనేక కష్టాల్లో ఉన్న బాలయ్య బాబు.. ఆ తర్వాత నుంచి ఫాంలోకి వచ్చాడు. అద్భుతమైన చిత్రాలతో వస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ముఖ్యంగా.. అఖండ, వీర సింహారెడ్డిలతో బాక్సాఫీసును షేక్ చేసిన ఈయన తాజాగా భగవంత్ కేసరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమానుఅనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కూడా ప్రధాన పాత్రలో కనిపించింది. అలాగే అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేయగా.. థమన్ సంగీతం అందించాడు.

Balakrishna Bhagavanth Kesari Movie Continues To Run in Theatres Even After 5 Weeks Check Details

ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన నందమూరి బాలకృష్ణ అక్టోబర్ 19వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో స్పందన పెరిగింది. పెద్ద ఎత్తున సినీ అభిమానులు థియేటర్లకు వెళ్లారు. భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య చెప్పిన డైలాగ్ లు, మాస్ ఫైట్, అదిరిపోయే పాటలకు అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. సినిమా విడుదల అయి నేటికి ఐదు వారాలు అవుతున్నా... థియేటర్లలో ఈ చిత్రం ఇంకా నడుస్తోంది.

బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తున్న భగవంత్ కేసరి చిత్రం ఇప్పట్లో వసూళ్లను ఆపేలా లేదు. అలాగే ఇప్పట్లో థియేటర్లలో నుంచి పోయేలా కూడా కనిపించట్లేదు. తాజాగా ఆరో వారంలో అడుగు పెట్టిన బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం.. మంచి లాభాలు పొందేందుకు భాగానే ట్రై చేస్తోంది. 30 రోజుల్లోనే 70 కోట్ల షేర్ మార్కుని అందుకొని దుమ్ము లేపింది. మొత్తంగా ఇప్పటటి వరకు బాక్సాఫీసు వద్ద 68.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 30 రోజల్లో సాధించిన కలెక్షన్లతో 1.58 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఇంకా పరుగను కొనసాగిస్తోంది.

Balakrishna Bhagavanth Kesari Movie Continues To Run in Theatres Even After 5 Weeks Check Details

మరికొన్ని రోజుల పాటు కూడా భగవంత్ కేసరి చిత్రం ఇలాగే థియేటర్ల వద్ద సందడి చేస్తే మరిన్ని లాభాలు పొందచ్చు. మంచి షేర్లు వస్తుండడం వల్లే సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం ఇంకా ప్లాన్ చేయలేదు. మరి థియేటర్ల వద్ద కాస్త హడావుడి తగ్గాకే భగవంత్ కేసరి ఓటీటీలోకి వస్తుంది. ఇంకా కొంత కాలం ఆగితే తప్ప ఏం జరుగుతుందో తెలిసేలా లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X