Bhagavanth Kesari: ముందుగానే బాలయ్య సినిమా రిలీజ్.. ముసురు సలిలో మంట లాంటి ముచ్చట

ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ గతంలో ఎన్నడూ లేనంత భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో ఆయన మరింత ఉత్సాహంగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు.

ఇలా ఇప్పుడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Balakrishna Bhagavanth Kesari Release Preponed to October 19th

వరుస హిట్లతో యమ ఉత్సాహంగా ఉన్న నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతం వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది.

మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ఎలాగైనా దీన్ని అనుకున్న సమయానికి తీసుకు వచ్చేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌పై తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్‌గా మారింది.

క్రేజీ కాంబోలో వస్తున్న సినిమాను ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని ఒకరోజు ముందుకు జరిపి అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారని తెలిసింది. అంతలోనే తాజాగా చిత్ర యూనిట్ 'గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట' అంటూ మధ్యాహ్నం 2:30 గంటలకు ఓ ప్రకటన చేస్తున్నట్లు తెలిపింది. ఇది కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించినదే అన్న ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే 'లియో'తో పాటు 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న వస్తుంది. 'టైగర్ నాగేశ్వర్రావు' 20న రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే, పాల్లక్ లల్వానీ కీలక పాత్రను చేస్తోంది. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X