Balakrishna: భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఫిక్స్.. బాలయ్య కెరీర్‌లోనే తొలిసారి ఇలా!
తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వేగంగా సినిమాలు చేసే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆ మధ్య ఎన్నో ఇబ్బందులు పడిన ఆయన.. 'అఖండ'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆ వెంటనే 'వీర సింహా రెడ్డి'తో కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించి మరో బిగ్గెస్ట్ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నారు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే మూవీలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని రూపొందిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

విభిన్నమైన కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిసింది. అదే సమయంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా పూర్తి చేసేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. అదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్‌ను కూడా అతి త్వరలోనే మొదలు పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
'భగవంత్ కేసరి' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని పోస్టర్లు, టీజర్, ఒక పాట మాత్రమే వచ్చాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరిన్ని అప్‌డేట్ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి రెండో పాటను కూడా వదులుతున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది.

ఫిలిం నగర్ సమచారం ప్రకారం.. 'భగవంత్ కేసరి' మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుందని తెలిసింది. ఇక, ఇది బాలయ్య కెరీర్‌లోనే బెస్ట్ ట్రైలర్ అయ్యేలా కట్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయన నుంచి వచ్చే డైలాగులు అదిరిపోయేలా ఉండబోతున్నాయని టాక్.
ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











