NBK108: అన్న దిగుతుండు.. బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్
ఏజ్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. గతంలో కంటే ఇప్పుడు మరింత ఉత్సాహంగా కనిపిస్తోన్నా ఈయన.. రెండేళ్ల కాలంలో వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి రెండు భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఊపును కంటిన్యూ చేయాలని ఇప్పుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ క్రేజీ మూవీని చేస్తోన్నారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
నటసింహా బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చినా.. ఇప్పుడు మాత్రం చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. దీన్ని దసరా బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బాలయ్య పుట్టినరోజు రాబోతుంది. దీన్ని పురస్కరించుకుని అప్‌డేట్లను వదలబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

నటసింహా నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడితో ఆయన చేస్తున్న సినిమా నుంచి స్పెషల్ అప్‌డేట్లను ప్లాన్ చేసినట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన చిత్ర యూనిట్.. అందులో 'అన్న దిగుతుండు.. బాలయ్య గారి పుట్టినరోజును గతంలో ఎన్నడూ జరుపుకోని విధంగా చేసేందుకు NBK108 టీమ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం అదిరిపోయే అప్‌డేట్లను రెడీ చేస్తున్నాం. ఆయన రాక కోసం ఆసక్తిని పెంచుకోండి' అంటూ వెల్లడించారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి 'భగవత్ కేసరి' టైటిల్‌ను దాదాపుగా ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.


Click it and Unblock the Notifications











