నీళ్ళల్లో బాలయ్య ఫైట్.. బోయపాటి ప్లాన్ మామూలుగా లేదు
పక్కా మాస్ కమర్షియల్ డైరెక్టర్ అయినటువంటి బోయపాటి శ్రీనివాస్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆడియెన్స్ కూడా ఆ సీన్స్ ను అమితంగా ఇష్టపడతారు. బోయపాటి సినిమాలు కొన్ని ప్లాప్ అయినప్పటికీ యాక్షన్ సీన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆడియెన్స్ కు కిక్కిస్తుంటాడు.
ఇక బోయపాటి బాలకృష్ణతో మూడవసారి చేస్తున్న BB3 సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సింహా, లెజెండ్ సినిమా తరువాత వస్తున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో ఒక యాక్షన్ సీన్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట.

బోయపాటి ఇంతకుముందు వినాయవిధేయ రామ సినిమాలో బీచ్ వాటర్ ఫైట్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు BB3లో కూడా అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఒకటి రెడీ చేస్తున్నారాట. బోయపాటి మార్క్ కు తగ్గట్లు సీన్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. మరి సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











