Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాలయ్య కూడా రెడీ అవుతున్నాడు.. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ
సినిమా ప్రపంచంలో ఒక్క సినిమా హిట్టయిన కూడా డైరెక్టర్ హీరో కాంబోను కలిపేందుకు నిర్మాతలు చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక్కడ సెంటిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫెస్టివల్ సమయంలో సరైన కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. చాలా వరకు అందరూ హీరోలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక బాలయ్య నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీని చేస్తున్న బాలకృష్ణ వీలైనంత త్వరగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శకుడితో రిలీజ్ డేట్ పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వచ్చే నెలలో సినిమకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇక బోయపాటితో సినిమాను పూర్తి చేసిన తరువాత బాలయ్య ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నిర్మాతలు దర్శకులు రెడీగా ఉన్నప్పటికీ కథలు అంతగా నచ్చకపోవడంతో బాలయ్య ధైర్యంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారు. ఇక మంచి కమర్షియల్ కథతో మేప్పిస్తే ఒప్పుకునే ఛాన్స్ ఉందని సి.కళ్యాణ్ ఇటీవల కెఎస్.రవికుమార్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. సినిమా స్క్రిప్ట్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు టాక్ వస్తోంది. మరి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి మరి.