#BB3 Akhanda: కపాలం పగిలిపోద్ది.. అఘోరా పాత్రలో బాలయ్య.. బోయపాటి పర్ఫెక్ట్ టైటిల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హై వోల్టేజ్ కాంబినేషన్లలో ఒకటైన బోయపాటి శ్రీనివాస్ - బాలకృష్ణ మూవీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సింహా - లెజెండ్ వంటి కమర్షియల్ మాస్ సినిమాల అనంతరం వీరి కలయికలో వస్తున్న మూడవ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం కాయమని చెప్పవచ్చు. ఇక ఉగాది సందర్భంగా టైటిల్ పై క్లారిటీ ఇచ్చేశారు.

హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేలా..
వరుస అపజయాలతో సతమతమవుతున్న దర్శకుడు బోయపాటి ఈ సారి తనకు ఇష్టమైన సెంటిమెంట్ హీరోతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. మరోవైపు బాలకృష్ణ కూడా సక్సెస్ చూసి చాలా కాలమయ్యింది. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

ఫస్ట్ ఆ టైటిల్ అనుకున్నప్పటికి..
ఇక సినిమాకు సంబంధించిన టైటిల్స్ పై గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో 'మోనార్క్' అని టాక్ గట్టిగానే వచ్చింది. అయితే రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ వాటిని పట్టించుకోలేదు. దర్శకుడు బోయపాటి ఎక్కువగా షూటింగ్ పైనే ఫోకస్ పెట్టాడు
కపాలం పగిలిపోద్ది
ఇక మొత్తానికి సినిమాకు సంబంధించిన టైటిల్ రోర్ అంటూ ఆడియెన్స్ కు సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక సినిమాకు అఖండ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అఘోరా పాత్రనే రిలీజ్ చేయడంతో అభిమానులకు అమితంగా నచ్చేసింది. ఇక బాలయ్య డైలాగ్ కూడా విజిల్స్ వేయించేలా ఉంది. కాలు దువ్వె నంది ముందు రంగు మార్చిన పంది. కారు కూతలు కూస్తే కాపాలం పగిలిపోద్ది.. అంటూ హై వోల్టేజ్ హావభావాలతో అదరగొట్టేసారు.

బాలకృష్ణకు పర్ఫెక్ట్ టైటిల్
చాలా రోజులుగా అఖండ టైటిల్ చర్చల్లో ఉన్నప్పటికీ దర్శకుడు పెద్దగా ఫోకస్ పెట్టలేదట. ఇక కథకు అలాగే బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు కరెక్ట్ గా సెట్టవుతుందని ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సింహా - లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ లో మూడవసారి వస్తున్న ఈ సినిమా కూడా అంతకు మించి అనేలా రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక సినిమాను వరల్డ్ వైడ్ న రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











