Daaku Maharaj Trailer: బాలయ్య వైల్డ్ పెర్ఫార్మెన్స్.. వణుకు పుట్టిస్తున్న 'డాకూ మహారాజ్'సెకండ్ ట్రైలర్ ..
Daaku Maharaj Trailer: నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకూ మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. బాలయ్య తన నటనతో విధ్వంసం సృష్టించడానికి సంక్రాంతి బరిలో నిలిచారు. డాకు మహారాజ్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చెయ్యాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ టీజర్స్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలా బాలయ్య బాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ అన్నీ కలిపి డాకు మహారాజును మరో రేంజ్ కు తీసుకు వెళ్లేలా కనిపిస్తోంది. తాజాగా డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ శుక్రవారం నాడు విడుదల అయింది.
నందమూరి బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన సినిమా డాకూ మహరాజ్. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే చాందినీ చౌదరి గెస్ట్ రోల్ నటించింది. అలాగే.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో కలిసి మాస్ అండ్ గ్లామరెస్ స్టెప్పులేసింది.

ఇప్పటికే డాకు మహారాజు సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్స్, పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. బాలయ్య బాబు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్.. సినిమా అంచనాలను అమాంతం పెంచేశాయి. అభిమానులు అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో డాకు మహారాజ్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ విడుదల అయింది.
తాజాగా విడుదలైన ట్రైలర్ బాలయ్య బాబు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. 'ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు.. వైల్డ్ యానిమల్'అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. 'రాయలసీమ మాలూమ్ హే తెరకు.. ఓ బి మై అడ్డా'. 'ఎవడైనా చదవడంలో మాస్టర్స్ చేస్తాడు.. నేను చంపడంలో మాస్టర్స్ చేశా'అంటూ బాలయ్య తన మాస్ డైలాగ్స్‌తో తన ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్నాడు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి.
అలాగే ఈ ట్రైలర్ లో తమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. బాలకృష్ణ డైలాగ్స్ కు తమన్ మ్యూజిక్ సరిగ్గా సెట్ అయిందనే చెప్పాలి. ఇక లాస్ట్ ..'నువ్వు అరిస్తే బార్కింగ్ నేను అరిస్తే .. అంటూ బాలయ్య డైలాగ్ ఈ ట్రైలర్స్ కే పీక్స్. ఆ సమయంలో తమన్ ఇచ్చిన బీజీఎం కేక.. ఈ ట్రైలర్ మాస్ ఆడియన్స్ కు పుల్ మిల్స్ అని చెప్పవచ్చు. మీరూ కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











