బాలయ్య, ఏంటయ్యా ఇది 120 KMPH స్పీడా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా రోజులుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చివరిగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ అందుకున్న ఆయన మరో హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తనకు రెండు సూపర్ హిట్ సినిమాలు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ఇప్పుడు అఖండ అనే సినిమా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ ఇటీవల తమిళనాడులో తాను హీరోగా నటిస్తున్న అఖండ యొక్క కీలక షెడ్యూల్ షూట్ పూర్తి చేశారు. సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ అక్కడ షూట్ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబందించిన మొత్తం టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది, కేవలం రెండు పాటలు మరియు కొన్ని ప్యాచ్ వర్క్‌లు మాత్రమే మిగిలి ఉండగా అవి హైదరాబాద్‌లో పూర్తి చేయాల్సి ఉంది.
అయితే ఆ సంగతి అలా ఉంచితే బాలకృష్ణ చెన్నై నుండి హైదరాబాద్‌కు కారు నడుపుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య కారు నడుపుతూ ఉండగా, కారు స్టీరియోలో భక్తి పాట ప్లే అవుతుంది. ఇక ఆయన కారులో ఉన్న ఇతరులతో తమిళంలో సంభాషించడం కూడా వీడియో కనిపిస్తుంది. అంతే కాక ఈ సమయంలో బాలకృష్ణ హైవేలో 120 KMPH వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఒక రకంగా ఇది ప్రమాదకరమైన స్పీడే అని చెప్పాలి. దీంతో కొందరు బాలయ్యా ఏంటయ్యా ? ఈ స్పీడ్ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మిగిలిన ప్యాచ్ వర్క్ కోసం అఖండ షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో పూన ప్రారంభమవుతుంది. జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల కానుంది.

నిజానికి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ అనే సినిమా కూడా మే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇంకా కాస్త మిగిలే ఉంది. కరోనా సెకండ్ వేవ్ కనుక లేకపోతే ఈ పాటికి షూటింగ్ జరిపి మే 28వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక సినిమా నుంచి ఉగాది కానుకగా విడుదలైన టీజర్ అఖండమైన స్పందన తెచ్చుకోవడంతో సినిమా మీద మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ టీజర్ ద్వారా సీనియర్ హీరోలకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ సాధించిన బాలయ్య మరిన్ని సినిమాతో మరిన్ని రికార్డులు తిరగరాసి తీరతాడు అని ఫాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా గెటప్లో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అది కూడా సినిమా మీద ఆసక్తి పెరగడానికి ఒక కారణం అని చెప్పచ్చు. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఇది ఒక రియల్ స్టోరీ మీద బేస్ చేసుకుని తీయబోతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











