వాళ్ళు నా ప్రాణం, ఒక్కరు దూరమైనా తట్టుకొలేను అంటూ.. ఫ్యాన్స్‌కు బాలయ్య రిక్వెస్ట్
నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానులకు నచ్చేలానే సినిమాలు చేస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని దర్శకులతో ఎక్కువగా డైలాగ్స్ యాక్షన్ సీక్వెన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇక బాలకృష్ణ జీవితంలో ఎలాంటి గుడ్ న్యూస్ వినిపించినా కూడా అభిమానులు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవడం అలబాటుగా వస్తున్నదే. ఇక ఇటీవల బాలయ్య ఒక విషయంలో అభిమానులకు ఎమోషనల్ గా వివరణ ఇవ్వక తప్పలేదు.

అన్ని రకాల ప్రయోగాలు చేసి
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసత్వం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలతోనే కాకుండా సోషియోయో ఫాంటసీ, మైథాలజి సినిమాలు కూడా ఎన్నో చేశారు. దాదాపు అన్ని రకాల ప్రయోగాలు చేసి తన అభిమానుల సంఖ్యను పెంచుకున్నాడు.

ఎమోషనల్ గా వివరించక తప్పలేదు
అసలు మ్యాటట్ లోకి వస్తే ఇటీవల అభిమానులకు బాలకృష్ణ ఒక చేదు విషయాన్ని ఎమోషనల్ గా వివరించక తప్పలేదు. బాలకృష్ణ అభిమానులకు ఏ స్థాయిలో గౌరవం ఇస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు ఆగ్రహానికి లోనైనప్పటికి కూడా వెంటనే కూల్ అయిపోతారని అందరికి తెలిసిన విషయమే.

ఇంటికి వస్తుండడంతో..
ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా బాలకృష్ణ పుట్టినరోజు వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 10వ తేదీన 61వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. అదే విధంగా అడ్వాన్స్ విషెస్ అందించేందుకు ఇంటికి కూడా వస్తున్నారట. విషయం సిరియాస్ గా తీసుకున్న బాలకృష్ణ పరిస్థితుల దృష్ట్యా అబోమనులు వేడుకలకు దూరంగా ఉండాలని వివరణ ఇచ్చారు.

ఒక్కరు దూరమైనా నేను భరించలేను
ప్రతి ఏడాది తన కోసం అభిమానులు రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఆ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదని అన్నారు. నన్నింతటి వాడిని చేసిన మీ అభిమానమే. అలాంటి అభిమానుల్లో ఒక్కరు దూరమైనా నేను భరించలేనని బాలకృష్ణ తెలిపారు.

మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక
మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక అంటూ వేడుకున్నారు. అలాగే
ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకు అలాగే కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూన్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియాలో వినయంగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications










