ఎన్టీఆర్‌ని ఫాలో కాబోతున్న బాలకృష్ణ.. సరికాదంటూ బాలయ్య ఫ్యాన్స్ ఫైర్

Recommended Video

Interesting Update On Balakrishna And KS Ravikumar Movie || Filmibeat Telugu

ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో తన తండ్రి జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుంచిన నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ సక్సెస్ పొందారు. ఇక తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. అయితే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బోయపాటి అనుకున్నారు కానీ..

బోయపాటి అనుకున్నారు కానీ..

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్‌తో సినిమా చేయాలని భావించారు బాలకృష్ణ. కానీ బోయపాటి తన స్క్రిప్ట్‌ని ఇంకా పవర్‌ఫుల్ చేసేందుకు కాస్త సమయం అవసరం కావడంతో ఈ లోగా తమిళ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తన కొత్త సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు బాలయ్య. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన జై సింహా బాక్సాఫీస్ దుమ్ముదులపడంతో అదే జోష్ కంటిన్యూ చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేశారు బాలకృష్ణ.

బాలకృష్ణ పోలీస్.. ఎన్టీఆర్ షేడ్స్

బాలకృష్ణ పోలీస్.. ఎన్టీఆర్ షేడ్స్

కె.ఎస్‌ రవికుమార్‌, బాలయ్య బాబు ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. విభిన్న కథాంశంలో రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. పైగా ఈ క్యారెక్టర్ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని పోలి ఉంటుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా చిత్ర కథ కూడా టెంపర్ స్టోరీ లైన్‌కి కాస్త దగ్గరగా ఉంటుందని సమాచారం. ఈ విషయంలో ఆఫీసియల్‌ స్టేట్‌మెంట్ లేదు గానీ ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చలు సాగుతున్నాయి.

రూలర్

రూలర్

ఈ చిత్రానికి సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇటీవలే ఆయన రూలర్ అనే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించడంతో బాలయ్య సినిమాకే కోసం ఈ రూలర్ అనే టైటిల్ అని ఫిక్సయ్యారు. కాగా టైటిల్ విషయంలో గానీ, హీరోయిన్స్ విషయంలో గానీ చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వారంలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి త్వరత్వరగా ఫినిష్ చేయనున్నారని తెలుస్తోంది.

బాలయ్య అభిమానుల నిరాశ

బాలయ్య అభిమానుల నిరాశ


బాలయ్య సినిమాకు రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వెలువడటంతో బాలయ్య అభిమానులు ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చి ఆ టైటిల్‌పై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ దమ్ము సినిమాలోని రూలర్ అనే పాట హిట్ కావడంతో అదే టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. అలా మిగిలిపోయిన ఆ టైటిల్ బాలయ్య సినిమాకు పెట్టడమేంటని నానా హడావిడి చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

బాలయ్య బాబు ప్రత్యేకం.. ఎవ్వరినీ ఫాలో కారు

బాలయ్య బాబు ప్రత్యేకం.. ఎవ్వరినీ ఫాలో కారు

తమ అభిమాన హీరో బాలకృష్ణకు ఓ ప్రత్యేకత ఉంటుందని, ఆయన ఇంతవరకూ ఎవ్వరినీ ఫాలో అయిన దాఖలాలు లేవని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ మేరకు ఎన్టీఆర్ కోసం అనుకున్న రూలర్ టైటిల్‌పై మండిపడుతున్నారు. అదేవిదంగా ఈ చిత్రంలో బాలయ్యలో ఎన్టీఆర్ టెంపర్ షేడ్స్ కనిపిస్తాయని వస్తున్న వార్తలు వారికి మింగుడు పడటం లేదట. ఈ నేపథ్యంలో ఎవ్వర్నీ ఫాలో కానీ బాలయ్య జూనియర్‌ని ఫాలో అవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు బాలయ్య అభిమానులు. చూడాలి మరి దీనిపై బాలయ్య స్పందన ఎలా ఉంటుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X