తీవ్ర విషాదంలో బాలకృష్ణ.. ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన వ్యక్తి మరణంతో..

నందమూరి బాలకృష్ణ తన అభిమానులు అంటే ఎంత ప్రాణం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి చేసి అభిమానులను ఎలా దండిస్తారో తాను అంటే అంటే ప్రాణం ఇచ్చే అభిమానులను అంతలా ప్రేమిస్తారు. అలాంటి ఒక అభిమాని దూరం కావడంతో ప్రస్తుతం బాలకృష్ణ, సహా బాలకృష్ణ అభిమానులు అందరూ విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

Recommended Video

Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
అనారోగ్యంతో

అనారోగ్యంతో

కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన బాలయ్య అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎలా కనిపిస్తాడో ఈ బాలయ్య కూడా అలాంటి బట్టలు వేసుకుని సందడి చేస్తాడు. వాస్తవానికి ఆయన అసలు పేరు వెంకటేష్ అయినా సరే ఆయన తన పేరును బళ్లారి బాలయ్యగా మార్చుకున్నాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు అని తెలుస్తోంది.

బాలయ్య స్వయంగా ఫోటోలు పంపేవారు

బాలయ్య స్వయంగా ఫోటోలు పంపేవారు

నిజానికి వెంకటేష్ తండ్రి హయాం నుంచి ఈ కుటుంబం నందమూరి అభిమానులుగా ఉంటున్నారు. బాలకృష్ణ ఏ సినిమాలో ఎలాంటి గెటప్ తో కనిపిస్తే బళ్లారి బాలయ్య కూడా అలాంటి దుస్తులు ధరించి సినిమాకి వెళ్లడం ఆనవాయితీ. బాలకృష్ణ కూడా ఈ బాలయ్య అంటే ప్రత్యేక అభిమానం చూపేవారు. సినిమా రిలీజ్ కావడానికి మూడు నెలల ముందు తాను ఎలాంటి గెటప్ వేస్తున్నానో ఆ ఫోటోలు బళ్లారి బాలయ్య పంపేవారట. దీంతో ఆయన అలాంటి దుస్తులు సిద్ధం చేసుకుని సినిమా విడుదల రోజు హంగామా చేసే వారిని అక్కడి స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు.

సమరసింహారెడ్డి కత్తి వలన అరెస్ట్

సమరసింహారెడ్డి కత్తి వలన అరెస్ట్

నిజానికి సమరసింహా రెడ్డి సినిమా రిలీజ్ సమయంలో తొమ్మిది వేలు ఖర్చు పెట్టి మరి వెంకటేష్ సమరసింహారెడ్డిలో బాలయ్య వాడిన కత్తి లాంటిదే ఒక కత్తి తయారు చేయించాడు. ఆ కత్తితో రోడ్డు మీద తన సహచర అభిమానులతో ర్యాలీగా వెళుతున్న సమయంలో పోలీసులు చూసి ఆయనను మారణాయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు కూడా. అయితే కోర్టులో ప్రవేశ పెట్టాక వెంకటేష్ లో ఉన్నది అభిమానం తప్ప ఎవరితో హాని కలిగించాలని ఉద్దేశం కాదని తెలుసుకున్న న్యాయమూర్తి ఆయనను మందలించి వదిలేశారు.

బాలయ్య సినిమా రిలీజ్ అంటే పండగే

బాలయ్య సినిమా రిలీజ్ అంటే పండగే

బాలయ్య ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాదాపు 30 వేలు ఖర్చు చేసి మరీ ఆయన సంబరాలు చేస్తూ ఉంటారు. బాలయ్య సినిమాలో ధరించిన లాంటి బట్టలు ధరించి హంగామా చేస్తూ రిలీజ్ అయిన రోజు ఒక పండుగ ఎలా జరుపుతారో ఆ రిలీజ్ రోజును అలా జరుపుతారు. కర్నాటకలో అంతర్భాగం అయిన బళ్లారి ప్రాంతంలో తెలుగు వారు కూడా ఎక్కువే. అలా బళ్ళారిలోని తెలుగు వారందరికీ బళ్లారి బాలయ్య సుపరిచితమే. బాలయ్య మీద అభిమానంతో ఆయన ఏడాదికి మూడు సార్లు బాలయ్యని కలుస్తూ ఉంటారట.

ఎన్టీఆర్, బాలయ్యలే దేవుళ్ళు

ఎన్టీఆర్, బాలయ్యలే దేవుళ్ళు

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వెంకటేష్ ఇంట్లో దేవుడి పటాలు కనిపించవు దేవుడి పటాలు బదులు నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ ఫోటోలు దర్శనమిస్తాయి ఏదైనా కష్టం వచ్చినా సరే బాలయ్య కుటుంబీకులు దేవుడిని తలుచుకోరు, నందమూరి బాలకృష్ణ, నందమూరి తారక రామారావుల తలుచుకొని ఆ కష్టం నుంచి గట్టెక్కించమని కోరుతారు. ఇంతలాగా అభిమానించారు కాబట్టే బాలకృష్ణ కూడా వీరి మీద ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఉంటారు. బాలయ్యకి ఇంత వీరాభిమాని కాబట్టే బాలయ్య అభిమానులు కూడా బళ్లారి బాలయ్య అభిమానిస్తూ ఉంటారు. అలాంటి అభిమాని దూరం కావడంతో బాలయ్య అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X